Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. భవదీయుడు భగత్ సింగ్ సాంగ్స్ రెడీ చేస్తోన్న దేవి..
Pawan Kalyan: గత ఎన్నికల సమయంలో సినిమాకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సెకండ్ ఇన్నింగ్స్‌తో తెగ జోరుమీదున్నారు పవర్ స్టార్.. పవన్ కల్యాణ్..
Pawan Kalyan: గత ఎన్నికల సమయంలో సినిమాకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సెకండ్ ఇన్నింగ్స్‌తో తెగ జోరుమీదున్నారు పవర్ స్టార్.. పవన్ కల్యాణ్. ఇప్పటికే తను సైన్ చేసని సినిమాలను ఫాస్ట్ ఫార్వడ్‌లో కంప్లీట్ చేస్తూ… ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. భీమ్లానాయక్ రిలీజ్ వాయిదా పడడంతో కాస్త ఢీలా పడ్డ పవన్ హర్డ్ కోర్ ఫ్యాన్‌ను సంతోషపెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. పవన్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడారు. ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలను కంపోజ్ చేశానని రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో చెప్పేసి… అందర్నీ ఖుషీ చేశారు. నెట్టింట వైరల్ అవుతున్నారు.. ఈ చిత్రంలోని పాటలు ఎనెర్జిటిక్ గా, మెలోడియస్ గా ఉండబోతున్నాయి అని తెలిపాడు.
పవన్, దేవిశ్రీ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవన్, హరీశ్, దేవీ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో… ఇప్పటి నుంచే ఈ సినిమా పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుందంటూ హరీష్ శంకర్ ఇప్పటికే హింట్ ఇచ్చి ఈ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశారు. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని దేవిశ్రీ తెలిపారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. తప్పకుండా అంచనాలు అందుకుంటాం అని దేవిశ్రీ చెప్పుకొచ్చాడు.
భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అనంతరం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. తర్వాతనే భవదీయుడు భగత్ సింగ్ మూవీ పట్టాలెక్కనునట్లు తెలుస్తోంది.
Also Read: