Hari Hara Veera Mallu: పవన్ క్రేజ్ అంటే ఇది.. రికార్డులు తిరగరాస్తున్న హరి హర వీరమల్లు ట్రైలర్..

పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ.. అటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు పవన్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అంచనాలు పెంచేసింది.

Hari Hara Veera Mallu: పవన్ క్రేజ్ అంటే ఇది.. రికార్డులు తిరగరాస్తున్న హరి హర వీరమల్లు ట్రైలర్..
Hari Hara Veera Mallu (6)

Updated on: Jul 04, 2025 | 2:27 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏ.ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత పవన్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో పవన్ మ్యానరిజం.. డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.

“ఇప్పటినుంచి పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు” అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా పవన్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తుంది హరిహర వీరమల్లు ట్రైలర్. ముందుగా ఈ మూవీ డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది.

24 గంటల్లో హరి హర వీరమల్లు తెలుగు ట్రైలర్ 48 మిలియన్ వ్యూస్ వచ్చాయని నిర్మాణ సంస్థ తెలిపింది. తెలుగు సినీ చరిత్రలో ఒక్క రోజులో ఇన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని పేర్కొంది. అన్ని భాషలలో కలిపి ఈ ట్రైలర్ కు 61.7 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు వెల్లడించింది. ఇది రికార్డ్ మాత్రమే కాదు.. రాబోయే ప్రతీ దానికీ ఇదో హెచ్చరిక అంటూ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..