Bheemla Nayak: డీజే సాంగ్ మోతమోగించడానికి వస్తున్న భీమ్లానాయక్.. ‘లాలా.. భీమ్లా..’పాటకు డీజే’ వెర్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యణ్ , దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాకు..
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యణ్ , దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే భీమ్లానాయక్ సినిమాకు మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వకీల్ సాబ్ లాంటి హిట్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో రానా పవన్ పోటీపోటీగా నటించనున్నారు.
ఈ సినిమాకు తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ జోష్ నింపేందుకు ‘డీజే’తో వస్తున్నారు చిత్రయూనిట్. నూతన సంవత్సర వేడుక మరింత రీసౌండ్ వచ్చేలా చేసేందుకు ‘లాలా.. భీమ్లా..’ పాటకు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ ‘డీజే’ వెర్షన్ ను రిలీజ్ చేయనుంది. డిసెంబర్ 31 రాత్రి 7.02 గంటలకు ‘లాలా డీజే’ పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. ఇప్పటికే లాలా భీమ్లా పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇక యూట్యూబ్ లో అయితే ఈ పాటకు మిలియన్ కొద్ది వ్యూస్ సాధించింది. మరి ఈ డీజే సాంగ్ ఎంతలా రీసౌండ్ చేస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :