Enemy Movie: ఎనిమీ నుంచి పడదే సాంగ్.. శ్రోతలను మరోసారి ఆకట్టుకుంటున్న థమన్ మ్యూజిక్..

|

Aug 21, 2021 | 4:05 PM

కోలీవుడ్ స్టార్ హీరోస్ విశాల్, ఆర్య కలసి నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం ఎనిమీ. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ సినినాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Enemy Movie: ఎనిమీ నుంచి పడదే సాంగ్.. శ్రోతలను మరోసారి ఆకట్టుకుంటున్న థమన్ మ్యూజిక్..
Enemy
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరోస్ విశాల్, ఆర్య కలసి నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం ఎనిమీ. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ సినినాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గద్దల కొండ గణేష్ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్‏గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‎కు మంచి స్పందన వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఎనిమీ నుంచి పడదే అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్.

అడెడే నిను చూసే కనులే… నీ స్నేహం కోసం కదిలే… అదిగో నిన్ను చూస్తేనే… ఏదో కొంచం సంతోషములే.. అంటూ సాగే ఈ పాటకు థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. సింగర్ పృథ్వీ చంద్ర ఆలపించారు. ఈ పెప్పీ సాంగ్ విశాల్, మృణాళినిలపై షూట్ చేశారు. ఈ పాట శ్రోతలకు ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో విశాల్ హీరోగా కనిపించనుండగా.. ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఇందులో ప్రకాష్ రాజ్, మహతా మోహన్ దాస్, తంబిరామయ్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మినీ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఆర్ధి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read: Nani: హీరో నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్ ఓనర్స్ అసోసియేషన్.. అపాలజీ లెటర్ రిలీజ్.. కారణమిదే..

Prabhas: ప్రభాస్‌తో నేను పెళ్లికి సిద్ధం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

Allu Arjun in AHA Office: ఆహా కొత్త ఆఫీసులో తళుక్కుమన్న అల్లు అర్జున్‌.. వైరల్‌ అవుతోన్న బన్నీ నయా లుక్‌.

మెగాస్టార్ తనయ నిర్మాణంలో మరో మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‏లుక్.. ఇంతకీ సినిమా పేరెంటో తెలుసా…