Operation Valentine Review: ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. పైలట్‏గా వరుణ్ హిట్ అందుకున్నట్టేనా ?..

కెరీర్ లో ఇప్పటికే కంచె, అంతరిక్షం లాంటి ఎన్నో ప్రయోగాత్మ సినిమాలు చేశాడు వరుణ్ తేజ్. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆలోచించిందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Operation Valentine Review: ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. పైలట్‏గా వరుణ్ హిట్ అందుకున్నట్టేనా ?..
Operation Valentine Movie
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 01, 2024 | 11:07 AM

రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్

నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మనుషీ చిల్లర్‌, రుహానీ శర్మ, అభినవ్‌ గోమటం, అలీ రెజా, సంపత్ రాజ్‌, షతాప్‌ ఫిగర్‌, శుభశ్రీ, లహరి శేరి, స్వేత తదితరులు

సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: మిక్కీ జే మేయర్‌

దర్శకుడు: శక్తి ప్రతాప్‌ సింగ్‌

నిర్మాత: సందీప్‌ ముద్దా

కెరీర్ లో ఇప్పటికే కంచె, అంతరిక్షం లాంటి ఎన్నో ప్రయోగాత్మ సినిమాలు చేశాడు వరుణ్ తేజ్. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆలోచించిందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ లో అర్జున్‌ దేవ్‌ ( వరుణ్‌ తేజ్‌) వింగ్‌ కమాండర్. ఆయన ఫ్లై చేస్తున్నప్పుడు రుద్ర అనే పేరు వాడుతుంటారు. ఒక సైనికుడిగా కంటే సేవియర్ గా ఉంటాడు అర్జున్. తన కళ్ళ ముందు తోటి సైనికుడికి ఏదైనా జరిగితే తన ప్రాణం అడ్డుపెట్టి మరి కాపాడుతాడు. దీనివల్ల చాలాసార్లు చావు అంచుల వరకు వెళ్లి బయటపడతాడు. రాడర్‌ కమాండర్‌ అహ్న గిల్‌ (మనుషీ చిల్లర్‌) ఆదేశాలతో తన ప్లెయిన్‌ డ్రైవ్‌ చేస్తుంటాడు. అయితే ఒకసారి ప్రాజెక్ట్ వజ్రలో భాగంగా భూమి నుంచి 20 మీటర్ల ఎత్తులో ప్లెయిన్‌ని నడిపించి శత్రువు రాడార్‌లకు చిక్కకుండా ఎటాక్‌ ప్లాన్ చేయొచ్చు అనేది టెస్ట్ చేసి చావు దగ్గరకు వెళ్ళొస్తాడు అర్జున్. కానీ ఈ టెస్ట్ లో తన స్నేహితుడు మరో వింగ్‌ కమాండర్‌ కబీర్‌(నవదీప్‌) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ప్రాజెక్ట్ వజ్రని ఎయిర్‌ఫోర్స్ అధికారులు బ్యాన్‌ చేస్తారు. ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక మిషన్ పూర్తి చేసి వస్తుండగా.. ఫిబ్రవరి 14, 2019లో కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన చూస్తాడు అర్జున్‌. అప్పటికే గాల్లో ఉన్న అర్జున్ మళ్లీ ఎటాక్ చేయాలనుకుంటాడు. కానీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అభ్యంతరం చెప్పడంతో వెనుతిరుగాడు. అయితే పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది జవాన్ల ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. అందుకే బాలకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ చేస్తారు. దీన్ని బాధ్యతలను కమాండర్‌ అర్జున్‌ తీసుకుంటారు. దీనికోసం పాకిస్థాన్‌ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్‌ క్రాస్‌ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశారు.. అసలు ఆపరేషన్‌ వాలెంటైన్‌ ఏంటి అనేది మెయిన్ స్టోరీ..

కథనం:

కమర్షియల్ సినిమాలు వారానికి ఒకటి వస్తుంటాయి. ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే ఇలాంటి ప్రయత్నమే ఓ సాహసం. అందులో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో కూడా కంచె, అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేశాడు వరుణ్ తేజ్. వాటి ఫలితాలతో సంబంధం లేకుండా నటుడిగా వరుణ్ మరో మెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ కూడా అదే. సుత్తి లేకుండా సూటిగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు శక్తి ప్రతాప్. ఆపరేషన్ వాలెంటైన్ కోసం బాగానే రీసర్చ్ చేశారు మేకర్స్. పుల్వామా అటాక్స్ సీన్ ఆసక్తికరంగా ఉంది. అక్కడ్నుంచి కథ మరింత వేగంగా ముందుకెళ్లింది. అయితే ఎంతసేపు పాకిస్తాన్ మన మీద చేసిన అటాక్స్ మాత్రమే చూపించారు కానీ.. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల తాలూకు కుటుంబాల ఎమోషన్ కూడా చూపించి ఉంటే బాగుండేది. వాటిని పైపైనే వదిలేసినట్టు అనిపించింది. ఫస్టాఫ్ కాస్త స్లో అనిపించినా.. సెకండాఫ్ మాత్రం బాగుంది.. ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్ సీన్ విజువల్ గా బాగుంది. పాకిస్తాన్ బోర్డర్ కాస్ట్ చేసి వాళ్ల మీద అటాక్ చేస్తున్న సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్.. అలాగే VFX కూడా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే వందేమాతరం RR ఎలివేషన్ ఇంకా పెంచింది. కొన్ని లోపాలు కనిపించినా కూడా ఆపరేషన్ వాలెంటైన్ అలరిస్తుంది.

నటీనటులు:

వరుణ్ తేజ్ ఈ క్యారెక్టర్ కోసం చాలా మేకోవర్ అయ్యాడు.. స్క్రీన్ మీద కనిపించింది. రాడార్ వింగ్ కమాండర్ గా మనుషి చిల్లర్ చాలా బాగా నటించింది. మరో ముఖ్యమైన పాత్రలో రుహాని శర్మ ఆకట్టుకుంది. సంపత్ రాజ్, అలీ రెజా, నవదీప్ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్:

సినిమాకి రీ రికార్డింగ్ బలం. మిక్కీ జే మేయర్‌ మంచి బీజీఎం ఇచ్చాడు. చాలా సన్నివేశాలు ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ పెంచింది. కెమెరా వర్క్ బాగుంది. హరి కే వేదాంతం సినిమాని రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కేవలం రెండు గంటల సినిమా మాత్రమే కాబట్టి ఎక్కడా పెద్దగా అనవసరపు సన్నివేశాలు కనిపించలేదు. కాకపోతే స్లో నరేషన్ ఇబ్బంది పెడుతుంది. అక్కడ మరింత క్లారిటీగా కట్‌ చేయాల్సింది. ఇక దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తన దేశభక్తిని చూపించుకున్నాడు కానీ మేకింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎమోషన్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే ఆపరేషన్ వాలెంటైన్ రేంజ్ ఇంకా పెరిగేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

పంచ్ లైన్:

ఆపరేషన్ వాలెంటైన్.. కొన్ని లోపాలున్నా.. అలరించే దేశభక్తి సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.