Tollywood: వీరిని చూసి బుద్ధి తెచ్చుకోండి! వరద బాధితులను ఆదుకోవడంలో కనిపించని స్టార్ హీరోయిన్స్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే స్థిర పడి కోట్లాది రూపాయల ఆదాయం ఆర్జిస్తోన్న స్టార్ హరోయిన్లు ఇంతవరకు తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించలేదు. సందర్భమొచ్చినప్పుడల్లా 'ఐ లవ్ తెలుగు ఆడియెన్స్' అని గొంతు చించుకునే అందాల తారలు ఈ కష్ట సమయంలో ఏం చేస్తున్నారు? విరాళాల సంగతి పక్కన పెడితే బాధితులకు భరోసా ఇచ్చేలా కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయచ్చు కదా.
భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం పూర్తిగా నీటమునిగిపోయింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది రోడ్డు పడ్డారు. తినేందుకు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు, నిర్మాతలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు అందజేశారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, విశ్వక్‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి స్టార్లంతా.. తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. సందీప్ కిషన్ లాంటి యంగ్ నటులు కూడా తమ టీమ్ లను వరద ప్రభావిత ప్రాంతాల్లోకి పంపి సహాయక చర్యలు చేపడుతున్నారు. మరి ఇండస్ట్రీ అంటే హీరోలు ఒక్కరేనా? హీరోయిన్లు కూడా ఉంటారు కదా? మరి ఈ కష్టకాలంలో వాళ్లెక్కడా కనిపించడం లేదు కదా? అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే స్థిర పడి కోట్లాది రూపాయల ఆదాయం ఆర్జిస్తోన్న స్టార్ హరోయిన్లు ఇంతవరకు తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించలేదు. సందర్భమొచ్చినప్పుడల్లా ‘ఐ లవ్ తెలుగు ఆడియెన్స్’ అని గొంతు చించుకునే అందాల తారలు ఈ కష్ట సమయంలో ఏం చేస్తున్నారు? విరాళాల సంగతి పక్కన పెడితే బాధితులకు భరోసా ఇచ్చేలా కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయచ్చు కదా.
పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, స్టార్ హీరోయిన్ హోదా లేకపోయనా అనన్య నాగళ్ల వరద బాధితుల కోసం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అలాగే ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ చొక్కారపు స్రవంతి వరద బాధితుల కోసం తన వంతు సాయంగా లక్ష రూపాయలు అందజేసింది. మరి వీరి కంటే ఎక్కువగా క్రేజ్ ఉండి, తెలుగు సినిమాలతోనే కోట్లాది రూపాయలు వెనకేసుకుంటోన్న స్టార్ హీరోయిన్ల సంగతేంటి? వరదలపై కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయచ్చు కదా? అంటున్నారు సినీ అభిమానులు.
అనన్య నాగళ్ల 5 లక్షల విరాళం..
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి…
— Ananya Nagalla (@AnanyaNagalla) September 3, 2024
అనన్య నాగెళ్ల, యాంకర్ స్రవంతిలు మన తెలుగు అమ్మాయిలు కనుక వారికి మన తెలుగు వారి బాధలు అర్థమయ్యాయని, మిగతా వారికి ఇవేవీ పట్టవని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడైనా స్టార్ హీరోయిన్లు మేలుకోవాలని, అనన్య, స్రవంతి లను చూసి బుద్ది తెచ్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.