Jawan Movie: షారుఖ్ ఖాన్ బర్త్ డే గిఫ్ట్.. ఓటీటీలోకి వచ్చేసిన జవాన్.. కొత్త సీన్స్ యాడ్
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సెలబ్రెటీలు కూడా షారుఖ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఇక షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా […]

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సెలబ్రెటీలు కూడా షారుఖ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఇక షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. కలెక్షన్స్ పరంగాను అదరగొట్టింది. ఏకంగా పఠాన్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే మరోసారి జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ పోషించారు. నయనతార ఈ సినిమాలో షారుక్ కు జోడీగా నటించింది. ఇక ఈ సినిమా కూడా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక ఇప్పుడు జవాన్ మూవీ ఓటీటీలో అలరించనుంది. షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (నవంబర్ 2) న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి జవాన్ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా డిలేటెడ్ సీన్స్ ను యాడ్ చేశారు. థియేటర్స్ లో రన్ టైం కారణంగా కొన్ని యాక్షన్ సీన్స్ ను తొలగించారు. ఇప్పుడు ఓటీటీలో అభిమానుల కోసం ఆ తొలగించిన సీన్స్ ను యాడ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పటికే జవాన్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ప్రేక్షుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Delivering Back to Back Two 100 cr+ Worldwid opening is a Monumental feat for a Hindi Film.
₹ 60-70 cr opening is still achievable in India but crossing 35 cr + Mark on day-1 at overseas market is a rare phenomenon. #ShahRukKhan unparalleled stardom In India & Overseas market… pic.twitter.com/fwWTbb0dPM
— Sumit Kadel (@SumitkadeI) September 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




