Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా..!
సాయి పల్లవి కోసం సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మనదగ్గర విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. సుకుమార్ లాంటి బడా డైరెక్టర్ కూడా ఆమె క్రేజ్ కు ఫిదా అయ్యిపోయారు. దాంతో లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా ఇచ్చారు. ఇక సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ ఆగ నిలిచాయి.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో తెలియని ఆనందం మొదలవుతుంది. హీరో ఎవ్వరైనా కానీ అందులో సాయి పల్లవి ఉంటే మాత్రం సినిమా సూపర్ గా ఉన్నట్టే అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతుంటారు. సాయి పల్లవి కోసం సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మనదగ్గర విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. సుకుమార్ లాంటి బడా డైరెక్టర్ కూడా ఆమె క్రేజ్ కు ఫిదా అయ్యిపోయారు. దాంతో లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా ఇచ్చారు. ఇక సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ ఆగ నిలిచాయి. ఈ మధ్య సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది సాయి పల్లవి. ఆతర్వాత తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది.
సినిమాల్లోకి రాక ముందు నుంచి సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రముఖ డ్యాన్స్ షో ఢీ లో సాయి పల్లవి పాల్గొన్న విషయం చాలా మందికి తెలుసు. ఢీ షోలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ షోలో ఆమె విన్ అవ్వలేదు. ఫైనల్ వరకు వెళ్లిన సాయి పల్లవి ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. అప్పట్లే ఆమె డాన్స్ చూసి స్టార్ హీరోయిన్స్ కూడా ఫిదా అయ్యారు. సమంత కూడా సాయి పల్లవి డాన్స్ పై ప్రశంసలు కురిపించింది.
సాయి పల్లవికి సంబందించిన పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవి పాత డాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సాయి పల్లవి అరుంధతి మూవీ సాంగ్ కు డాన్స్ చేసింది. అరుంధతి సినిమాలో అనుష్క చేసిన సాంగ్ ను అచ్చు దింపేసింది అనుష్క. ఆ సినిమాలో అనుష్క , సోనూ సూద్ ను అంతం చేసే ముందు వచ్చే పాటలో రంగు బట్టలను పట్టుకుని ధం ధం మరణ మృదంగం అనే పాటకు డాన్స్ చేస్తుంది. అదే పాటను అదే తరహాలో చేసి చూపించింది సాయి పల్లవి. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై సాయి పల్లవి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాకు తండేల్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సాయి పల్లవి డాన్స్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.