- Telugu News Photo Gallery Cinema photos With the Pan India trend, are the heroes getting away from the fans?
Heroes: పాన్ ఇండియా ట్రెండ్ తో ఫ్యాన్స్‌కు హీరోలు దూరం అవుతున్నారా.. వాళ్ల సమస్యేంటి.?
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో ఓ అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతుంది. ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్‌కు దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు.. వాళ్ల సమస్యేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Updated on: May 20, 2024 | 8:30 AM

పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలకు మంచి రోజులు వచ్చాయేమో కానీ హీరోల అభిమానులకు మాత్రం ఎదురు చూపులే మిగిలాయి. దేశమంతా మార్కెట్ వస్తుంది.. పైగా రెమ్యునరేషన్ కూడా 100 కోట్లకు పైనే వస్తుంది.. ఇన్ని లాభాలున్నాయి కాబట్టి ఒక్కో సినిమా కోసం మూడు నాలుగేళ్లు తీసుకుంటున్నారు హీరోలు.

అన్ని భాషలకు రీచ్ అవ్వాలనే ఐడియా బాగానే ఉంది కానీ.. ఫ్యాన్స్ మాత్రం హీరోల తీరుతో నిరాశలోనే ఉన్నారు. తెలుగులోనే ఉన్నపుడు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా పుణ్యమాని మూడేళ్లకోసారి కూడా కనిపించట్లేదు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌నే తీసుకోండి.. 2019 నుంచి 2024 మధ్యలో ఈయన చేసింది బ్లాక్ బస్టర్ సినిమా ట్రిపుల్ ఆర్ మాత్రమే. అంటే అరవింత సమేత తర్వాత చేసింది ఒకే సినిమా అన్నమాట.

రామ్ చరణ్ పరిస్థితి ఇలాగే ఉంది. 2019లో వినయ విధేయ రామలో నటించిన ఈయన.. ఆ తర్వాత నాలుగేళ్లలో ఒకే సినిమా చేసారు.. అదే ట్రిపుల్ ఆర్. మధ్యలో ఆచార్యలో నటించినా.. అది గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే.

ఇక అల్లు అర్జున్ 2020లో అల వైకుంఠపురములో చేసారు.. 2021 నుంచి పుష్ప వరల్డ్‌లోనే ఉన్నారు. మరో ఏడాది పాటు అందులోనే ఉండిపోయేలా ఉన్నారు బన్నీ. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ముగ్గురూ పాన్ ఇండియన్ సినిమాల కోసమే కెరీర్‌లో బాగా స్లో అయ్యారు. మరోవైపు ప్రభాస్ మాత్రం దూకుడు మీదున్నారు. కరోనా తర్వాత రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి.. రాజా సాబ్, కల్కి, సలార్ 2 లైన్‌లో ఉన్నాయి. ఈ ప్లానింగ్ లేకే చరణ్, బన్నీ, తారక్ వెనకబడ్డారు. పాన్ ఇండియా మంచిదే అయినా.. ఇంత స్లోగా ఉంటే ఫ్యాన్స్‌కు దూరమైపోతారు స్టార్ హీరోలు.





























