
హీరోయిన్ నివేదా థామస్.. సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. బాలనటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు తమిళం, మలయాళం భాషలలలో అనేక చిత్రాల్లో నటించింది. జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా.. ఆ తరవాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో మెరిసింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ నివేదాకు తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో మరోసారి అడియన్స్ మందుకు వచ్చింది. ఇందులో ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నివేదా నటనకు ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇటీవల 35 చిన్న కథ కాదు చిత్రానికి గానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. శనివారం హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలకు హాజరైన నివేదాను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఒకప్పుడు నాజుగ్గా ఎంతో అందంగా కనిపించిన నివేదా.. ఇప్పుడు బొద్దుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ వేడుకలో మెరూన్.. టోన్డ్ సీక్విన్డ్ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది నివేదా. అయితే ఈ ముద్దుగుమ్మ బొద్దగా మారడంతో ఆమె ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. నివేదాకు ఏమైంది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నివేదా నటించిన 35 చిన్న కథ కాదు సినిమాకు నంది కిషోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2024లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రియదర్శి పులికొండ, గౌతమి, విశ్వదేవ్ రాచకొండ, అభయ్ శంకర్ కీలకపాత్రలు పోషించారు. తన కొడుకును గణితంలో ఉత్తీర్ణుడయ్యేలా ప్రోత్సహించే తల్లి పాత్రలో కనిపించింది నివేదా. ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే ఒక తల్లిగా, గృహిణిగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..