Macherla Niyojakavargam: ఓటీటీ బాట పట్టిన నితిన్ నయా మూవీ.. మాచర్ల నియోజకవర్గం స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే

|

Aug 17, 2022 | 4:03 PM

కుర్ర హీర్ నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాల్సిందే.. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఈ యంగ్ హీరోకు సాలిడ్ హిట్ పడలేదు.

Macherla Niyojakavargam: ఓటీటీ బాట పట్టిన నితిన్ నయా మూవీ.. మాచర్ల నియోజకవర్గం స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే
Macherla Niyojakavargam
Follow us on

కుర్ర హీర్ నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాల్సిందే.. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఈ యంగ్ హీరోకు సాలిడ్ హిట్ పడలేదు. చెక్ , రంగ్ దే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన మ్యాస్ట్రో సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న మాచర్ల నియోజ వర్గం(Macherla Niyojakavargam) సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీ స్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో నితిన్ సరసన లేటెస్ట్ సెన్షేషన్స్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా పై నెగిటివ్ రిపోర్ట్ రావడంతో డిజాస్టర్ గా నిలిచింది మాచర్ల నియోజక వర్గం.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రానుందని తెలుస్తోంది. ఇటీవలే ఓటీటీలో సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. సినిమా రిలీజ్ అయినా నెల రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ ను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మార్చర్ల నియోజక వర్గం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 9న ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మాచర్ల నియోజకవర్గం సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. మరి ఈ సినిమా ఓటీటీలోనైనా ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..