Nithin-Sreeleela: విద్యార్థులతో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన నితిన్, శ్రీలీల.. వీడియో ఇదిగో
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తోన్న చిత్రం రాబిన్ హుడ్. భీష్మ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కంచిన ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత రాబిన్ హుడ్ సినిమాలో మరోసారి జత కట్టారు టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నితిన్- శ్రీలీల. భీష్మ సినిమాతో ఫేమస్ అయిన వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మంకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. కాగా సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో రాబిన్ హుడ్ మూవీ టీమ్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా తాజాగా రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ కాలేజీకి వెళ్లారు హీరో, హీరోయిన్లు నితిన్, శ్రీలీల. ఈ సందర్భంగా తమ సినిమా గురించి అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం స్టూడెంట్స్‌తో నితిన్, శ్రీలీల కలిసి ‘వేరెవర్ యు గో’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు.
నితిన్, శ్రీలీల డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘జోడీ అదుర్స్.. వావ్ సూపర్.. చాలా బాగా డ్యాన్స్ చేశారు’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Dance, fun and a lot of lively energy 💥💥@actor_nithiin and @sreeleela14 dance to #WhereverYouGo with the students of ISTS College, Rajahmundry ❤🔥#Robinhood GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash #RajendraPrasad… pic.twitter.com/1PeDPIqP4V
— Mythri Movie Makers (@MythriOfficial) March 16, 2025
రాబిన్ హుడ్ సినిమాలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, దేవదత్తా నాగ, షైన్ టామ్ చాకో, ఆడుకలం నరేన్, మైమ్ గోపి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది.
Team #Robinhood at the Kanaka Durga Temple, Vijayawada to seek blessings ahead of the film’s release on March 28th ✨
Vijayawada! Meet the team at PVP Mall today from 6 PM onwards ❤🔥#Robinhood GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14… pic.twitter.com/5RBg61ygDz
— Mythri Movie Makers (@MythriOfficial) March 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








