Nikhil: నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పై సినిమా విడుదల అప్పుడే..

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాకుండా.. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.

Nikhil: నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పై సినిమా విడుదల అప్పుడే..
Nikhil Siddarth

Updated on: Jun 17, 2023 | 8:41 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ భారీ బడ్జెట్ మూవీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హీరోతో సినిమాలను నిర్మించేందుకు మేకర్స్ సైతం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిఖిల్ నటిస్తోన్న చిత్రాల్లో స్పై ఒకటి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాకుండా.. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను జూన్ 20న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదలవుతున్న ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంయుక్తంగా సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.