Committee Kurrollu: ఓటీటీలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్ళు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే

ఆగస్టు 9న కమిటీ కుర్రాళ్ళు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో అక్కడ ఉండే ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. 

Committee Kurrollu: ఓటీటీలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్ళు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే
Committee Kurrollu
Follow us

|

Updated on: Aug 31, 2024 | 9:04 AM

చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అయిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా కు ముందునుంచి మంచి అంచనాలు ఉన్నాయి. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచి రాజు, త్రినాధ్ వర్మ, మణికంఠ, లోకేష్ కుమార్, శ్యామ్ కళ్యాణ్, శివ కుమార్, సాయికుమార్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఆగస్టు 9న కమిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో అక్కడ ఉండే ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ

తాజాగా కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 5న కమిటీ కుర్రోళ్లు సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్‌లో రన్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ లాక్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవి విన్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ఓటీటీలో అలరించనుంది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

ఇది కూడా చదవండి : Prasad Behara : అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు

ఇక కమిటీ కుర్రాళ్ళు సినిమా కథ విషయానికొస్తే.. వెస్ట్ గోదావరిలోని పురుషోత్తపల్లి అనే గ్రామంలో శివ (సందీప్ సరోజ్), సూర్య (యశ్వంత్ పెండ్యాల), సుబ్బు (త్రినాధ్ వర్మ), విలియం (ఈశ్వర్), పెద్దోడు (ప్రసాద్ బెహరా) తోపాటు మరో ఆరుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే అనుకోకుండా ఊళ్లో జరిగిన చిన్న గొడవ కారణంగా అందరూ విడిపోతారు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా గడిపేస్తుంటారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఊళ్ళో జరిగే జాతర కోసం అందరూ ఊరికి వస్తారు. అందరు కలిసి చిన్న తనం గురించి. అప్పుడు జరిగిన సంఘటనలు, గొడవలు చేసిన తప్పులు గురించి మాట్లాడుకుంటారు. అదే సమయంలో ఊర్లో సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికల్లో శివ నిలబడతాడు. అతను స్నేహితులు అతనికి ఎలా సాయం చేశారు. ఆతర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఓటీటీలో చూడాలంటే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
విమానంలో లవ్ ప్రపోజల్ | పాత జ్ఞాపకాలతో గల్లీ క్రికెట్.!
మంచు ఫ్యామిలీ మూడో తరం "తిన్నడు".! మంచు అవ్రామ్‌ పోస్టర్‌ లుక్‌..
మంచు ఫ్యామిలీ మూడో తరం
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు.! కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి.
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
భారత్‌లో టెలిగ్రామ్‌ యాప్ బ్యాన్.? సెక్షన్ 14C ప్రకారం..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!