AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆతర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ సక్సెస్ ఇచ్చారు పూరిజగన్నాథ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది నిధి అగర్వాల్.

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..
Nidhi Agarwal
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2023 | 7:52 AM

Share

నిధి అగర్వాల్.. ఈ అమ్మడి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆతర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు.

వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ సక్సెస్ ఇచ్చారు పూరిజగన్నాథ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది నిధి అగర్వాల్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి గ్లామర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేసింది నిధి అగర్వాల్. అక్కడ శింబు హీరోగా నటించిన ఈశ్వరన్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తమిళ్ లో రెండు మూడు సినిమాలు మాత్రమే చేసింది ఈ భామ.

ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తుంది. నిధి అగర్వాల్. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా సాగుతుంది. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా మొగలాయిలా కాలం నటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ యువరాణిగా కనిపించనుంది. ఈ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది నిధి అగర్వాల్. ఈ సినిమా హిట్ అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఎక్కువ వస్తాయని ఆశపడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.