AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi agerwal : అందాల నిధికి అదిరే ఆఫ‌ర్లు.. అయినా నిస్తేజం.. ఎందుకంటే..?

ఇది కలయా లేక నిజమా అంటూ ఒక రకమైన విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు బార్బీ బొమ్మ నిధి అగర్వాల్. కొంచెం నీరు.. కొంచెం నిప్పులా ఉందట...

Nidhhi agerwal : అందాల నిధికి అదిరే ఆఫ‌ర్లు.. అయినా నిస్తేజం.. ఎందుకంటే..?
Nidhi Agarwal 5
Ram Naramaneni
|

Updated on: May 08, 2021 | 3:06 PM

Share

ఇది కలయా లేక నిజమా అంటూ ఒక రకమైన విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు బార్బీ బొమ్మ నిధి అగర్వాల్. కొంచెం నీరు.. కొంచెం నిప్పులా ఉందట ఆమె కెరీర్ ఇప్పుడు. సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా కూడా తెలీడం లేదట. బట్.. తన ప్రియమైన శత్రువుని ఓడించానన్న ఒక తృప్తిని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారట. ఆమె మిక్స్ డ్ ఫీలింగ్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం ప‌దండి.

ఇస్మార్ట్ శంకర్ కి దిమాక్ ఖరాబ్ చేసి, సెన్సేషనల్ హిట్ కొట్టిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడెక్కడ? అని స్టేటస్ రిపోర్ట్ కోసం వెతుక్కుంటున్నారు సినీ జనం. ఎందుకుంటే.. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరికి కొత్త ఇన్నింగ్స్ మొదలైనట్లే.. హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా అగర్వాల్ కి కూడా గోల్డెన్ రూట్స్ పడతాయన్నది అప్పట్లో అందరి ఒపీనియన్. అనుకున్నట్లే.. నభాకు ఛాన్సులు వెతుక్కుంటూనే వచ్చాయి. బట్.. నో యూజ్..!

డిస్కోరాజా, సోలో బతుకే సోబెటర్, అల్లుడు అదుర్స్ మూడు సినిమాలూ తిరగబడ్డంతో మళ్ళీ వెనక్కే అన్నట్లుంది నభా నియర్ ఫ్యూచర్. ఇప్పుడు నితిన్ మాస్ట్రో మూవీలో కూడా ఆమెకు లిమిటెడ్ స్క్రీన్ స్పేసే వుంది. కట్ చేస్తే.. మరో భామ నిధి కెరీర్ మాత్రం ఇప్పుడిప్పుడే గేర్ మార్చి హైవే మీదికెక్కేసింది. శింబు పక్కన తమిళ్ డెబ్యూ చేశాక.. కొంతలోకొంత షైన్ అయ్యింది నిధి గ్రాఫ్. తమిళనాట గుడి కట్టి పూజలు చేసేదాకా వెళ్ళింది నిధి వ్యవహారం.

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న హరిహర వీరమల్లు కాస్టింగ్ లో నిధి పేరుందన్నది రీసెంట్ డేస్ లో ఫిలిం నగర్ బిగ్ న్యూస్. కట్ చేస్తే.. ఇప్పుడు మహేష్ బాబుతో త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న థర్డ్ మూవీ కూడా నిధి అగర్వాల్ నే చేర్చుకుందట. బ్యాక్2 బ్యాక్ పవర్ స్టార్-సూపర్ స్టార్ మూవీస్ లో కనిపించడమంటే… ఇట్స్ నాట్ ఏ లిటిల్ థింగ్ అనేది ఇండస్ట్రీ ఫీడ్ బ్యాక్.కాకపోతే.. ఈ రెండు భారీ సినిమాల్లోనూ తనది మెయిన్ ఫిమేల్ లీడ్ కాదన్నదే నిధిని ఇబ్బంది పెడుతున్న మేటర్. అందుకే సెలబ్రేట్ చేసుకునే మూడ్ లో లేరట నిధి అగర్వాల్. ఇక్కడే.. ఆమె చిల్ అయ్యే మరో ముచ్చట కూడా వుంది. ఇస్మార్ట్ మూవీలో తనకు కౌంటర్ పార్ట్ అయిన నభానటేష్ లైనప్ లో ఈ మాత్రం స్టఫ్ కూడా లేదుగా..? అని ఓదారుస్తున్నారు నిధి ఫాలోయర్లు.

Also Read:  ‘ఆహా’లో అలరిస్తున్న అనసూయ ‘థాంక్యూ బ్రదర్‌’.. గర్భవతి పాత్రలో ఆకట్టుకున్న జబర్ధస్ భామ..

మోడ్రన్ హెయిర్‌ కట్‌తో రాముడు, డిఫరెంట్ మేకవర్‌లో రావణుడు.. నెట్టింట ట్రోల్స్