వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి

అందాల నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే క్రేజీ అవకాశం చేజిక్కించుకుంది.

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2021 | 8:54 AM

Nidhhi Agerwal temple: అందాల నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే క్రేజీ అవకాశం చేజిక్కించుకుంది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి ఊహించని గిఫ్ట్ వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు గుడి కట్టి, ఏకంగా పాలభిషేకం చేశారు అభిమానులు. ఆ విషయాన్ని స్వయంగా నిధినే చెప్పింది. ఇంత ప్రేమను అస్సుల ఊహించలేదని, జన్మజన్మలకు గుర్తుపెట్టుకుంటానని చెప్పింది.

ప్రేమికుల దినోత్సవం కానుకగా తమిళనాడులో ఓ చోట నిధి అగర్వాల్ విగ్రహానికి, కొందరు తెలుగు, తమిళ ఫ్యాన్స్ పాలతో అభిషేకం చేశారు. ఆ ఫొటోల్ని కొందరు నిధికి సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు. ఈ అనూహ్య పరిణామంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. గతంలో తమిళంలో ఎమ్​జీఆర్, ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి పలువురు నటీనటులకు గుడి కట్టారు. నిధి అగర్వాల్ తమిళంలో నటించిన తొలి రెండు చిత్రాలు ఈ ఏడాది సంక్రాంతికే విడుదలయ్యాయి. ‘భూమి’ ఓటీటీలో, ‘ఈశ్వరన్’ థియేటర్లలో రిలీజైంది.

Also Read:

 రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు

South Heroine: ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా..?