Viral Photo: కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా పోజిచ్చిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా! అబ్బాయిల డ్రీమ్ గర్ల్..
ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది...
ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్ స్టోరీతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ అందాల భామ.. మూడో సినిమాతో అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. ఎవరో కనిపెట్టారా.? లేక చిన్న క్లూ ఇమ్మంటారా.. ఈమె కోసం ఫ్యాన్స్ ఏకంగా గుడి కట్టేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈపాటికి మీకే అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు నిధి అగర్వాల్.
View this post on Instagram
హిందీ మూవీ ‘మున్నా మైకేల్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచమైన నిధి అగర్వాల్.. తెలుగులో ‘సవ్యసాచి’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత నటించిన ‘మిస్టర్ మజ్ను’ ఫర్వాలేదనిపించింది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ కమర్షియల్‌గా సక్సెస్ అందుకుంది. కాగా, ప్రస్తుతం తెలుగులో ‘హీరో’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలు చేస్తోంది.