AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan : హీరో హృతిక్ రోషన్‌ను టార్గెట్ చేసిన ట్రోలర్స్.. కారణం ఇదే..

ప్రస్తుతం సౌత్ సినిమాల పేరు ప్రపంచమంతటా మారుమ్రోగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాకు నార్త్‌లో క్రేజ్ పెరిగిపోతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే మన సినిమా హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే.

Hrithik Roshan : హీరో హృతిక్ రోషన్‌ను టార్గెట్ చేసిన ట్రోలర్స్.. కారణం ఇదే..
Hrithik Roshan
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2022 | 4:27 PM

Share

ప్రస్తుతం సౌత్ సినిమాల పేరు ప్రపంచమంతటా మారుమ్రోగుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాకు నార్త్‌లో క్రేజ్ పెరిగిపోతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే మన సినిమా హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. మన సినిమాలు అక్కడ రీమేక్ అయి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి మాధవన్ నటించిన విక్రమ్ వేద సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మాధవన్ ఇద్దరూ పోటీపడి నటించారు. ఇక బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్(Hrithik Roshan)నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా హృతిక్ రోషన్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తమిళ్ విక్రమ్ వేదలో విజయ్ సేతుపతి నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆయన తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు.అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి నటనను హృతిక్ రోషన్ నటనతో పోల్చుతూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి న్యాయం చేసిన స్థాయిలో హృతిక్ రోషన్ తన పాత్రకు న్యాయం చేయలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదు. అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేక పోతున్నాయి. వరుసగా అక్కడ సినిమాలన్నీ ఫ్లాప్ లను మూటకట్టుకుంటున్న సమయంలో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు హిందీ ఫ్యాన్స్ కానీ ఇప్పుడు ఈ ట్రోల్స్ అక్కడ హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..