
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ దంపతులు తమ కవల పిల్లలతో కలిసి ఫెస్టివల్ విషెస్ చెప్పారు. నయనతార, విఘ్నేష్ ఇరువురు తమ పిల్లలను ఎత్తుకొని ఎంతో క్యూట్‌గా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. “జీవితంలో మీకు వ్యతిరేకంగా ఏర్పడే అన్ని అడ్డంకుల మధ్య మీ ప్రియమైన వారిందరికీ ఆనందం, శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కష్టపడి ప్రార్థించండి.. కష్టపడి ప్రేమించండి. ప్రతి ఒక్కరికీ మనం ఇవ్వగలిగేది ప్రేమ మాత్రమే.. ఈ జీవితాన్ని మరింత అందంగా, సంపన్నంగా మారుస్తుంది. కేవలం భగవంతుడిపై నమ్మకం.. ప్రేమ ఉంచండి.. ఇతరులకు మంచి చేయండి.. మీ నమ్మకంలో ప్రపంచంలో ప్రతిదీ ఎప్పుడూ అందంగా ఉండేలా చూసుకుంటుంది” అంటూ రాసుకొచ్చారు విఘ్నేష్.
దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్.. విఘ్నేష్.. జూన్ 9న వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా అక్టోబర్ 9న తాము కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డారు ఈ జంట. నయన్ దంపతులకు పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. దీంతో వీరి సరోగసి పద్దతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం వివాదస్పదంగా మారింది..
దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వం.. పిల్లల జననంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే తమకు ఆరేళ్ల క్రితమే చట్టబద్ధంగా వివాహం జరిగిందంటూ నయన్ దంపతులు ప్రభుత్వానికి తెలియజేసినట్లుగా సమాచారం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.