Nayanthara : ఇన్ స్టాలో ఆ ఒక్క టాలీవుడ్ హీరోయిన్‏ను మాత్రమే ఫాలో అవుతోన్న నయనతార.. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేని నయన్.. తాజాగా ఇన్ స్టాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన కుమారులు ఉలకత్, ఉయిర్ లను రెండు చేతుల్లో ఎత్తుకుని.. వీరి ముగ్గురు కూలింగ్ గ్లాసెస్ ధరించి మాస్ లుక్ లో నడుస్తూ నేను వచ్చానని చెప్పు అంటూ డైలాగ్ చెబుతూ వీడియో షేర్ చేసింది నయన్. ఆమె ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన క్షణాల్లోనే భారీగా ఫాలోవర్స్ వచ్చేశారు.

Nayanthara : ఇన్ స్టాలో ఆ ఒక్క టాలీవుడ్ హీరోయిన్‏ను మాత్రమే ఫాలో అవుతోన్న నయనతార.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2023 | 9:02 AM

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేని నయన్.. తాజాగా ఇన్ స్టాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన కుమారులు ఉలకత్, ఉయిర్ లను రెండు చేతుల్లో ఎత్తుకుని.. వీరి ముగ్గురు కూలింగ్ గ్లాసెస్ ధరించి మాస్ లుక్ లో నడుస్తూ నేను వచ్చానని చెప్పు అంటూ డైలాగ్ చెబుతూ వీడియో షేర్ చేసింది నయన్. ఆమె ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన క్షణాల్లోనే భారీగా ఫాలోవర్స్ వచ్చేశారు. కేవలం ఒక్కరోజులోనే 1.4 మిలియన్ మంది ఫాలోవర్స్ సొంతం చేసుకుంది నయన్.

ఇక తన కవల పిల్లలతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేసిన నయన్.. ఆ తర్వాత జవాన్ ట్రైలర్ షేర్ చేస్తూ అభిమానులను అలరించింది. ఇక ఇన్ స్టాలో నయనతార 18 మందిని ఫాలో అవుతున్నారు. అందులో ఒకే ఒక్క టాలీవుడ్ హీరోయిన్ ఉన్నారు. తనే సమంత.

ఇవి కూడా చదవండి

వీరిద్దరు కలిసి గతంలో కణ్మణి రాంబో ఖతిజా సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. నయన్ భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. తమిళంతోపాటు తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక సమంతతోపాటు.. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, తన భర్త విఘ్నేష్ శివన్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, మిచెల్ ఒబామా, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, అనుష్క శర్మ, నిహారిక ఎన్ఎమ్, ది లిప్ బామ్ కంపెనీ, హాలీవుడ్ నటీ జెన్నీఫర్ అనిస్టాన్, జెన్నీఫర్ లోపేజ్, బైవన్స్, తన సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్, డాక్టర్ రేనిత రాజన్, న్యూట్రిషనిస్ట్ మున్మున్ గరినేవాల్ లను ఫాలో అవుతున్నారు నయన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో