RamaRao On Duty: మాస్ రాజా రామారావు ఆన్ డ్యూటీ ఈవెంట్‌కు గెస్ట్‌గా నేచురల్ స్టార్
మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండువా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ రాజా సరసన మజిలీ బ్యూటీ రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ(RamaRao On Duty). శరత్ మండువా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ రాజా సరసన మజిలీ బ్యూటీ రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పంచాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, గ్లిమ్ప్స్ , ట్రైలర్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఏ క్రమంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు మేకర్స్.
ఈ రోజు (24న) ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరవుతున్నారు. నాని, రవితేజ ఇద్దరు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొచ్చినవాళ్లు కావడంతో ఈ ఈవెంట్ ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. నేచురల్ స్టార్ , మాస్ మహారాజ్ ను కలిసి ఓకే స్టేజ్ పైన సందడి చేస్తే చూడాలి అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో వేణు తొట్టెంపూడి ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో వేణు కనిపించనున్నారు. ఇటీవల వేణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.