Uppena : బ్లాక్ బస్టర్ ఉప్పెన సినిమా వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే అందాల భామ కృతిశెట్టి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఉప్పెన.. అందమైన ప్రేమ కథ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే అందాల భామ కృతిశెట్టి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసింది. తొలి సినిమాతోనే 100కోట్ల మార్క్ ను అందుకున్నాడు బుచ్చిబాబు. అయితే ఈ సినిమా ముందుగా మరో హీరోతో అనుకున్నారట. ఆ హీరో ఎవరో తెలుసా..
2021లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే.. నేచురల్ స్టార్ నాని. బుచ్చిబాబు ముందుగా ఈ సినిమాను నానితో చేయాలని అనుకున్నారట. అయితే నాని ఆ సమయంలో వరుస సినిమాలకు కమిట్ అయ్యి బిజీగా ఉండటంతో సినిమా చేయడం కుదరలేదట.
నాని సినిమా కథను కూడా వినకుండా నో చెప్పాల్సి వచ్చిందని తెలుస్తోంది. నిజంగా ఈ సినిమా నాని చేసి ఉంటే నేచురల్ స్టార్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడేది. నాని నో చెప్పడంతో వైష్ణవ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట. నాని ప్రస్తుతం దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా నాని కెరీర్ లో 30వ మూవీ.