Nani: మరోసారి ఆ క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని( Nani) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. శ్యామ్ సింగరాయ్ సానియాతోపాటు రీసెంట్ గా వచ్చిన అంటే సుందరానికి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు నాని.
నేచురల్ స్టార్ నాని( Nani) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. శ్యామ్ సింగరాయ్ సానియాతోపాటు రీసెంట్ గా వచ్చిన అంటే సుందరానికి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ తెలుగులోకి స్ట్రయిట్ ఎంట్రీ ఇచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత నాని దసరా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ఈ సినిమాతర్వాత నాని ఎవరితో సినిమా చేయనున్నదన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
నాని కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా భలే భలే మగాడివోయ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనని కెరీర్ కు ప్లస్ అయ్యింది. ప్రస్తుతం మారుతి టాలీవుడ్ లో బిజీ డైరెక్టర్ గా మారిపోయారు. గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. అయితే మారుతి నానితో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ సినిమా లేట్ అయ్యే అవకాశాలు ఉండటంతో ఈలోగా నానితో సినిమా చేయాలనీ చుస్తున్నాడట మారుతి ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి