Nandamuri Balakrishna: రీరిలీజ్‌కు రెడీ అవుతున్న నటసింహం మరో సినిమా.. బాలయ్య పుట్టిన రోజున..

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను 4కే వెర్షన్‏లో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ అందరి సినిమాలు మళ్లీ విడుదలై భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

Nandamuri Balakrishna: రీరిలీజ్‌కు రెడీ అవుతున్న నటసింహం మరో సినిమా.. బాలయ్య పుట్టిన రోజున..
Balakrishna
Follow us

|

Updated on: May 27, 2023 | 3:16 PM

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హంగామా నడుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను 4కే వెర్షన్‏లో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ అందరి సినిమాలు మళ్లీ విడుదలై భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు ఆడియన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల యంగ్ టైగర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సింహాద్రి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ మళ్లీ రిలీజ్ కాబోతుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు బాలకృష్ణ నటించిన మరో సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయుడు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన హిట్ గా నిలిచింది. బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. జూన్ 10న ఆయ‌న బ‌ర్త్ డే ఈ సంద‌ర్భంగా అభిమానులు భారీ ఏర్పాటు చేసుకుంటున్నారు.

2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు జూన్ 10న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను అభిమానులు ప్ర‌క‌టించ‌నున్నారు. నరసింహనాయుడు రూ.30 కోట్ల‌ను వ‌సూలు చేసి అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను క్రియేట్ చేసింది.