AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vignesh Shivan: ధనుష్‏తో గొడవ పై విఘ్నేష్ శివన్ రియాక్షన్.. జీవితంలోనే పెద్ద పశ్చాత్తాపం అంటూ కామెంట్స్..

తమిళంలో సక్సెస్ ఫుల్ దర్శకులలో విఘ్నేష్ శివన్ ఒకరు. తక్కువ సమయంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ఎల్ఐకే. ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఏప్రిల్ 10న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న విఘ్నేష్ శివన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Vignesh Shivan: ధనుష్‏తో గొడవ పై విఘ్నేష్ శివన్ రియాక్షన్.. జీవితంలోనే పెద్ద పశ్చాత్తాపం అంటూ కామెంట్స్..
Vignesh Shivan, Nayanthara
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2026 | 10:14 AM

Share

విఘ్నేష్ శివన్.. దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో విజయవంతమైన దర్శకుడు. శింబు నటించిన ‘బోడ బోడి’ సినిమాతో తమిళ చిత్రసీమలో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన నానుమ్ రౌడీ తాన్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి హీరో ధనుష్ నిర్మాత. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సూర్య నటించిన ‘తానా సెర్ంద కూట్టం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ఎల్ఐకే. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి, ఆ తర్వాత వాయిదా వేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విఘ్నేష్.. హీరో ధనుష్ తో తనకున్న అనుబంధంపై స్పందించారు. ధనుష్ తో తన స్నేహం బ్రేక్ కావడం తన జీవితంలోనే పెద్ద పశ్చాత్తాపం అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ.. “నాకు హీరో ధనుష్ అంటే చాలా ఇష్టం. నటుడిగానే కాకుండా, నేను అతడిని ఎంతో గౌరవిస్తాను. ధనుష్ పుట్టినరోజు జూలై 28న. అదే రోజున మా నాన్న గారు చనిపోయారు. అందుకే నేను ధనుష్ లో మా నాన్నను చూసుకుంటాను. నాకు అతనంటే అంత ఇష్టం. కానీ కొన్నిసార్లు కొంతమందితో మనకెందుకు విభేదాలు వస్తాయో మనకే తెలియదు. దాన్ని మనం అర్థం చేసుకోలేం. పరిస్థితులు అలా ఉంటాయి. ధనుష్‌తో నా స్నేహం కోల్పోవడాన్ని నా జీవితంలోనే అతిపెద్ద నష్టంగా భావిస్తాను. మనం ఎంతో ఇష్టపడేవారితో మన స్నేహం కోల్పోతే అతి జీవితంలోనే పెద్ద లోటు. నేను ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, అది ధనుష్ వల్లే. నా ప్రస్తుత పరిస్థితికి అతనే ప్రధాన కారణం. వెళైయిల్ల పట్టధారి షూటింగ్ సమయంలో నేను రెండేళ్లకు పైగా అతనితో ఉన్నాను. ఆ సమయంలో అతడు తిన్న తర్వాతే తినేవాడిని. అంతగా మా మధ్య అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. ధనుష్ తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

విఘ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ నానుమ్ రౌడీ తాన్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాత. అయితే తమ పెళ్లి డాక్యూమెంటరీలో ఈ సినిమా నుంచి మూడు సెకన్ల వీడియో ఉపయోగించుకున్నారు. దీంతో తమ అనుమతి లేకుండా వీడియో ఎలా వినియోగిస్తారంటూ ధనుష్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో ధనుష్ ను విమర్శిస్తూ సుధీర్ఘ పోస్ట్ చేసింది. కేవలం మూడు సెకన్ల వీడియోకు రూ.10 కోట్లు డిమాండ్ చేయడమేంటనీ మండిపడింది. అదే సమయంలో అటు విఘ్నేష్ శివన్ సైతం ధనుష్ కు వ్యతిరేకంగా పోస్టులు చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బ్రేక్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us