AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

మీరు కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకమైన పీపీఎఫ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా..? మూడు సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే మీకు శుభవార్త. మీరు పీపీెఫ్ బ్యాలెన్స్‌పై రుణం కూడా సులువుగా తీసుకోవచ్చు. వీటి వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?
Ppf Account
Venkatrao Lella
|

Updated on: Apr 06, 2026 | 10:20 AM

Share

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) సేవింగ్స్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో పెట్టుబడి పెడితే దీని ద్వారా వచ్చే వడ్డీ, ఆదాయంపై ఎలాంటి ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. డబ్బులు పొదుపు చేసుకోవడంతో పాటు ఆదాయం పొందేందుకు ఇది సహాయపడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ఒక ఏడాదిలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ లేని పెట్టుబడులు కోరుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

పీపీఎఫ్ రుణం ఎలా తీసుకోవాలి..?

మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే నిధులు అవసరమైన సమయంలో రుణం కూడా తీసుకోవచ్చు. అకౌంట్ తెరిచిన మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య పీపీఎఫ్ బ్యాలెన్స్‌పై నామమాత్రపు వడ్డీతో రుణం తీసుకోవచ్చు. ఫారం డీ పూర్తి చేసి మీరు పీపీఎఫ్ అకౌంట్ తెరిచిన బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌ను సంప్రదించాలి. పీపీఎఫ్ నెంబర్, రుణం ఎంత కావాలి? పాస్ బుక్ కాపీ, డిక్లరేషన్ వంటి సమాచారం అందించాలి. పరిశీలన అనంతరం మీకు లోన్ మంజూరు చేస్తారు. ఈ రుణాన్ని మీరు 36 నెలల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

రుణం ఎంత పొందవచ్చు..?

మీరు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న సంవత్సరానికి ముందున్న రెండవ సంవత్సరం చివరి నాటికి పీపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న నిల్వలో 25 శాతం వరకు గరిష్టంగా రుణం పొందవచ్చు. ఇక 36 నెలల్లోగా చెల్లిస్తే ఆరు సంవత్సరాల్లోపు రెండోసారి రుణం పొందే అవకాశం ఉంటుంది.

వడ్డీ రేట్లు ఎంత..?

ఇక 36 నెలల్లోపు చెల్లిస్తే వడ్డీ రేటు సంవత్సరానికి 1 శాతం అంత తక్కువగా ఉంటుంది. 36 నెలల తర్వాత చెల్లిస్తే రుణం పంపిణీ చేసిన తేదీ నుంచి వడ్డీ రేటు సంవత్సరానికి 6 శాతం అవుతుంది. తిరిగి చెల్లించే కాలంలో మీ పీపీఎఫ్ పొదుపు ఎలాంటి వడ్డీ లభించదు. మీరు వడ్డీని రెండు లేదా అంతకంటే తక్కువ నెలవారీ ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. మీరు వడ్డీలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే మిగిలిన మొత్తం మీ పీపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి తీసివేస్తారు. మీకు డబ్బులు అత్యవసరమైన సమయంలో ఇలా రుణం రూపంలో లబ్ది పొందవచ్చు. వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే పొదుపు, ఆదాయమే కాకుండా రుణ సౌకర్యం కూడా పొందే వెసులుబాటు ఉందని చెప్పవచ్చు. ఇది పెట్టుబడిదారులకు అత్యవసర ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడుతుంది.

Follow Us