Tollywood: అమ్మ బాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్.. లేటెస్ట్ లుక్ చూస్తే స్టన్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలో అడుగుపెట్టిన వారు ప్రస్తుతం హీరో హీరోయిన్లుగా నటిస్తూ మంచి పేరు దక్కించుకుంటున్నారు. అదే ట్రెండ్ ఫాలో అవుతోంది సారా అర్జున్. నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కీ రోల్ చేసిన ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్ రేంజ్ పాత్రలు చేస్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ చూశారా.. ?
పాత్ర కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టే వ్యక్తి.. విక్రమ్. ఐ, తంగలాన్ వంటి సినిమాల్లో రోల్స్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిన విషయమే. విక్రమ్‌కు తెలుగులో కూడా అపారమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక విక్రమ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు ప్లాఫ్ అవ్వొచ్చు కానీ నటుడిగా మాత్రం విక్రమ్ ఫెయిల్ అవ్వడు. శివపుత్రుడు (తమిళ వెర్షన్ పితామగన్) సినిమాకు నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. ఇక విక్రమ్ యాక్టింగ్ స్థాయిని తెలియజేసే మరో చిత్రం నాన్న. ఇందులో మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా నటించి ప్రశంసలు అందుకున్నాడు విక్రమ్. తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలోని సన్నివేశాలు మనసును మెలిపెడతాయి. ఈ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? తన పేరు సారా అర్జున్.
ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ చిత్రంలో యువ ఐశ్వర్య రాయ్‌గా నటించి అందరి చేత కాంప్లిమెంట్స్ అందుకుంది. తాజాగా ‘క్యూజీ గ్యాంగ్ వార్’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే ఈ యువ సుందరి హీరోయిన్‌గా మంచి ప్రాజెక్ట్స్ దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.