Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్!

సాధారణంగా సినిమా అనుకున్న విజయం సాధించనప్పుడు.. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్లు తిరిగి ఇచ్చేస్తుంటారు. పూర్తిగా కాకపోయినా సగమైనా తిరిగి ఇస్తుంటారు. గతంలో తమ సినిమాలు బోల్తా పడినప్పుడు చాలా మంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఇలాగే చేశారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఇలాంటి మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు

Harish Shankar: 'మిస్టర్ బచ్చన్' ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
Director Harish Shankar
Follow us

|

Updated on: Sep 04, 2024 | 7:41 PM

సాధారణంగా సినిమా అనుకున్న విజయం సాధించనప్పుడు.. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్లు తిరిగి ఇచ్చేస్తుంటారు. పూర్తిగా కాకపోయినా సగమైనా తిరిగి ఇస్తుంటారు. గతంలో తమ సినిమాలు బోల్తా పడినప్పుడు చాలా మంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఇలాగే చేశారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఇలాంటి మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. మాస్ మహారాజ రవితేజతో కలిసి అతను తెరకెక్కించన చిత్రం మిస్టర్ బచ్చన్. భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను సాధించలేకపోయింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వాటిల్లాయని సమాచారం. అందుకే డైరెక్టర్ హరీశ్ శంకర్ తన గొప్ప మనసును చాటుకుంటూ రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ను తిరిగి వెనక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరికొంత మొత్తం వెనక్కి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల బాగు కోరి హరీష్ శంకర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. .

2018లో హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నల గడ్డ ఓ కీలక పాత్రలో మెరవడం విశేషం.

ఇవి కూడా చదవండి

థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ..

మిస్టర్ బచ్చన్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..