AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saripodhaa Sanivaaram: జపాన్‌లో విడుదలకానున్న నాని సినిమా.. పక్కా వర్కౌట్ అవుతుందంటున్న ఫ్యాన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటాయి. నాని సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి మొదలవుతుంది. ఆడియన్స్ కూడా నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అంటుంటారు. అదే విధంగా నాని కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా నాని వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు.

Saripodhaa Sanivaaram: జపాన్‌లో విడుదలకానున్న నాని సినిమా.. పక్కా వర్కౌట్ అవుతుందంటున్న ఫ్యాన్స్
Nani
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2025 | 7:49 PM

Share

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వరుసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు నాని. దసరా సినిమా నుంచి మొదలు పెట్టి హాయ్ నాని, సరిపోదా శనివారం సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. నాని ప్రొడక్షన్ హౌస్ లో హిట్ సినిమా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. అలాగే ఈసారి నాని హిట్ 3 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సరిపోదా శనివారం సినిమాతో నాని మంచి విజయాన్ని అందుకున్నాడు. సరిపోదా శనివారం సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక నాని ఇప్పుడు హిట్ 3 తర్వాత దసరా దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే నాని సినిమా ఇప్పుడు జపాన్ లో విడుదలకు రెడీ అవుతుంది. ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ సినిమాలు జపాన్ లోనూ విడుదల అవుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా జపాన్ లో విడుదలై మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అంతకంటే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్  ముత్తు సినిమా కూడా అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా జపాన్ లో విడుదలయ్యాయి.  అక్కడి ప్రేక్షకులు కూడా మన సినిమాలను ఆదరిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ వెళ్లి మరీ ప్రమోషన్స్ చేశారు. మొన్నీమధ్య విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా కూడా జపాన్ లో విడుదలైంది. ఇక ఇప్పుడు నాని నటించిన సరిపోదా శనివారం సినిమా కూడా జపాన్ లో విడుదలకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 14న ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా జపాన్ లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి జపాన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి