Shyam Singha Roy movie: నేచురల్ స్టార్ నాని ఫుల్ జోరు మీదున్నాడు. ప్రస్తుతం వరుస సినినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే టక్ జగదీష్ సినిమాను పూర్తి చేసాడు నాని. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకీర్తన్ తో సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా సినిమాలు షూటింగులు ఆపేసుకున్నాయి. టాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయినట్టేనని భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. షూటింగులు ఆపేసి ఇళ్లలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ నాని మాత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ మాత్రం నాన్ స్టాప్ గా షూటింగు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు షూటింగ్ ని తప్పనిసరై ఆపాల్సిన పరిస్థితి వచ్చింది.. నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలోసరికొత్త లుక్ లో కనిపించనున్నాడునాని. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఇందులో నాని డిక్టెటివ్ పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదో కామెడీ అండ్ థ్రిల్లింగ్ డిటెక్టివ్ స్టోరీ అని అంటున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసరాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారు. ఇది నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.
మరిన్ని ఇక్కడ చదవండి :