Nandamuri Kalyan Ram: బింబిసార 2లో రాకాసి క్యారెక్టర్.. ఆసక్తికరమైన రోల్‌లో ఓ హీరోయిన్

| Edited By: Ravi Kiran

Aug 30, 2022 | 8:19 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో హిట్ అందుకున్నారు.

Nandamuri Kalyan Ram: బింబిసార 2లో రాకాసి క్యారెక్టర్.. ఆసక్తికరమైన రోల్‌లో ఓ హీరోయిన్
Bimbisara
Follow us on

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార (Bimbisara) సినిమాతో హిట్ అందుకున్నారు. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ అనుకున్న స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయారు. ఇక రీసెంట్ గా బింబిసార సినిమాతో సాలిడ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాను పలు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు. దాంతో ఇప్పుడు బింబిసార 2 కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

17 రోజుల్లోనే రూ. 60 కోట్ల క్లబ్ లో చేరి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. బింబిసార 2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందట. అయితే ఈ పార్ట్ లో ఓ రాకాసి పాత్ర ఉంటుందట. ఇందుకోసం ఓ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెల్ అంతా ఆ రాకాసితో కళ్యాణ్ రామ్ పోరాడటం ఉంటుందట. మరి ఆ రాకాసి పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ ‘బింబిసార 2’ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి