AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veera Simha Reddy: ఓటీటీలో గర్జనకు ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

థియేటర్‌లో ఎంజాయ్ చేసినవాళ్లు ఈ సినిమాను మళ్లీ ఓటీటీలో ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. అనివార్య కారణాల వల్ల మిస్ అయినవాళ్లు ఓటీటీ విడుదల కోసం ఆతృతగా ఉన్నారు.

Veera Simha Reddy: ఓటీటీలో గర్జనకు ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?
Veera Simha Reddy OTT Release Date
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2023 | 6:39 PM

Share

ఈ పొంగల్‌కి వీరసింహారెడ్డి పేరుతో థియేటర్లకు వచ్చి దుమ్ములేపారు బాలయ్య. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మాసీవ్ హిట్‌గా నిలిచింది. బాలయ్య మాస్‌ మసాలా డైలాగ్స్‌, యాక్షన్‌కు థియేటర్స్‌ దద్దరిల్లిపోయాయి. రెండు కేరక్టర్లలో, మూడు గెటప్పుల్లో బాలయ్య అదర గొట్టేశారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మన దగ్గర మాస్ సినిమాకి B, C సెంటర్లలో ఎంత ఈలలు, గోలలు ఉంటాయో.. యూఎస్‌లో అంతేస్థాయిలో పూనకాలతో ఊగిపోయి.. భారీ కలెక్షన్స్ అందించారు ప్రవాస భారతీయులు.

బాక్సాఫీస్ వద్ద మాంచి కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరారు బాలయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో గోపిచంద్ మలినేని నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. హనీ రోజ్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, మురళీ శర్మ.. కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆతృతగా చూస్తున్నారు అభిమానులు. ప్రముఖ OTT సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ వీరసింహరెడ్డి స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 21 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. గతంలో అఖండను దక్కించుకున్న డిస్నీ+ హాట్‌స్టార్ వచ్చిన లాభాలతో స్టన్ అయిందట. అందుకే భారీ ధరకు వీరసింహారెడ్డి దక్కించినట్లు ఇండస్ట్రీ టాక్. వీరసింహారెడ్డి చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మెయిన్ అస్సెట్ అని చెప్పాలి.  ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, జై బాలయ్య వంటి పాటలు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అల్లాడించాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ దుమ్మలేపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.