Balayya: ట్రోలింగా జుజుబీ.. మనసుకు నచ్చింది చేయడమే ఆయన హాబీ.. బాలయ్య అదిరే సాంగ్
బాలయ్య అంటేనే ఎమోషన్.. ఆయన ఆడినా, పాడినా చేసినా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. అందుకే తనపై ఎంత ట్రోలింగ్ జరిగినా.. లైట్ తీసుకుంటారు బాలయ్య. తన ఫ్యాన్స్‌కు నచ్చితే చాలంటారు. ఇంతకీ ఆయన పాటను మీరు విన్నారా..?
నువ్వేం అనుకుంటున్నావో అది చేయ్.. పక్కవాడు నీ గురించి ఏమనుకుంటే అది నీకెందుకు..? నీ పని నువ్వు సరిగ్గా చేస్తే అయిపోతుందిగా..! ఈ మాటలనే ఫాలో అవుతున్నారు బాలయ్య. తనపై ట్రోలింగ్‌ను జుజుబీలా తీసేస్తుంటారు NBK. తాజాగా మరోసారి తన గాత్రంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసారు ఈయన. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో బాలయ్య పాట వైరల్ అవుతుంది. బాలయ్య అంటేనే ఎమోషన్.. ఆయన ఆడినా, పాడినా చేసినా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. అందుకే తనపై ఎంత ట్రోలింగ్ జరిగినా.. లైట్ తీసుకుంటారు బాలయ్య. తన ఫ్యాన్స్‌కు నచ్చితే చాలంటారు. ఇప్పుడూ ఇదే చేసారు ఈయన. ఖతర్‌లో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా.. అతి క్లిష్టమైన క్లాసికల్ సాంగ్ ‘శివశంకరీ’ని పాడి అదరగొట్టారు బాలయ్య.
బాలయ్య పాట పాడిన ప్రతీసారి ట్రోల్ చేస్తుంటారు. కానీ దాన్ని ఫన్నీగానే తీసుకుంటారు ఆయన. పైగా ప్రతీసారి రెట్టించిన ఉత్సాహంతో పాడుతుంటారు. తాజాగా శివశంకరీలోని రాగాలని గుర్తు పెట్టుకుని మరీ పాడి ఆశ్చర్యపరిచారు బాలయ్య. గతంలోనూ మేము సైతం ఈవెంట్‌లో శ్రీమన్నారాయణ సినిమాలోని చలాకీ చూపులతో సాంగ్ పాడి తన ఎనర్జీతో షాకిచ్చారు బాలయ్య. ఇక పైసా వసూల్‌లో బాలయ్య పాడిన మామా ఏక్ పెగ్ లా సాంగ్ ఇప్పటికీ ట్రెండే.
ఆ తర్వాత మరో ఈవెంట్‌లో లెజెండ్‌లోని నీ కంటి చూపుల్లోకి.. మొన్నటికి మొన్న వీరసింహారెడ్డి విజయోత్సవంలోనూ తన గాత్రంతో అలరించారు బాలయ్య. మొత్తానికి తను పాడితే ట్రోల్ చేస్తారని తెలిసినా.. అనుకున్నది అనుకున్నట్లు చేస్తూ ఔరా అనిపిస్తుంటారు బాలయ్య.