Anasuya: విజయ్‌కు, అనూకు మధ్య గొడవ అసలు ఎప్పుడు మొదలైంది.. ? ఇదిగో డీటేల్స్

యాంకర్ అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండ మధ్య ఇంకా లెక్కలు తేలలేదా..? అసలు ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవేంటి..? ఎప్పుడూ రౌడీ హీరోనే అనసూయ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? పాత సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్‌లా ఈ ఇద్దరి మధ్య ఏదైనా పాత పగలున్నాయా..? అసలెందుకు ప్రతీసారి విజయ్‌ను అనసూయ కామెంట్ చేస్తుంటారు..? ఈ ఇద్దరి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది..?

Anasuya: విజయ్‌కు, అనూకు మధ్య గొడవ అసలు ఎప్పుడు మొదలైంది.. ? ఇదిగో డీటేల్స్
Anasuya - Vijay Deverakonda
Follow us

|

Updated on: May 10, 2023 | 1:52 PM

బుల్లితెరపై టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న అనసూయ.. సోషల్ మీడియాలోనూ దూకుడు మీదుంటారు. తాజాగా ఈమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. అయితే అప్పుడప్పుడూ తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి వివాదం సృష్టిస్తుందనే ఇమేజ్ ఈమె సొంతం. ఒక్క ట్వీట్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చారు అనసూయ భరద్వాజ్. తాజాగా విజయ్ దేవరకొండ పేరు పెట్టకుండా.. ఓ పోస్ట్ చేసారు అనసూయ. ‘ది’ నా.. బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం అంటూ ఒక పోస్ట్ షేర్ చేసారు ఈ యాంకర్. అందులో ఏముంది అనుకోవచ్చు.. అక్కడే ఉంది అసలు మ్యాటర్. ఈ మధ్యే ఖుషీ పోస్టర్‌లో విజయ్ పేరుకు ముందు ‘ది’ అని ఉంది. అది హైలైట్ చేస్తూ.. అనసూయ ఈ ట్వీట్ చేసారని అనసూయను ట్రోల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఆమె వారికి కౌంటర్స్ ఇస్తూనే ఉంది. ఇక హరీశ్ శంకర్ లాంటి దర్శకులు సైతం ‘ది’ అనే సంభోదిస్తూ.. విజయ్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు.

కాగా అర్జున్ రెడ్డి టైమ్ నుంచే అనసూయ, విజయ్ మధ్య గొడవ మొదలైంది. మొదలు పెట్టింది మాత్రం అనసూయే అంటారు విజయ్ ఫ్యాన్స్. అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజీపై విజయ్ మాట్లాడిన ఓ మాట అనసూయకు నచ్చక విమర్శించారు.. ఆ తర్వాత ఎప్పుడు ఛాన్సొచ్చినా విజయ్‌పై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలో విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో నటించారు అనసూయ.

మీకు మాత్రమే చెప్తా సినిమా తర్వాత విజయ్, అనసూయ మధ్య అంతా సర్దుకుందనుకున్నారంతా. కానీ ఇంకా కాలేదని తాజాగా ఈమె ట్వీట్‌తో అర్థమవుతుంది. నువ్వు విజయ్‌ను ట్రోల్ చేస్తే.. మేం ఆంటీ పదాన్ని ట్రెండ్ చేస్తామంటున్నారు ఫ్యాన్స్. మరి ఇదెక్కడ ఆగుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?