Nandamuri Balakrishna: బాలయ్య దూకుడు మాములుగా లేదుగా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కాబాక్సఫీస్ దగ్గర ప్రస్తుతం వీరసింహారెడ్డి కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు. గత ఏడాది అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కాబాక్సఫీస్ దగ్గర ప్రస్తుతం వీరసింహారెడ్డి కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 100కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు బాలయ్య. ఇక ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా కూడా పూర్తవ్వడంతో నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూజాకార్యక్రమం కూడా ఈ మధ్యనే జరిగింది. ఈ సినిమా అనిల్ స్టైల్ లో కామెడీతో పాటు ,బాలయ్య స్టైల్ లో యాక్షన్ తో కూడి ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూతురిగా శ్రీలీల కనిపించనుంది.




అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో లో సినిమా ఆ చేయనున్నారు బాలయ్య. ఈ రెండు సినిమాలే కాకుండా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉంటుంది. అలాగే అలానే ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట్ తో కలిసి మరో సినిమా చేయనున్నారు బాలయ్య. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కూడా సినిమా చేస్తున్నారు బాలయ్య.




