పల్నాటి బ్రహ్మనాయుడు, ఒక్క మగాడు కాదు.. నా కెరీర్‌లో అతి పెద్ద రాడ్డు సినిమా ఇదే.. స్వయంగా చెప్పిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ సినిమా కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఫ్లాపు సినిమాలు, అభిమానులకు ఏ మాత్రం నచ్చని చిత్రాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇదే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు నందమూరి నటసింహం.

పల్నాటి బ్రహ్మనాయుడు, ఒక్క మగాడు కాదు.. నా కెరీర్‌లో అతి పెద్ద రాడ్డు సినిమా ఇదే.. స్వయంగా చెప్పిన బాలయ్య
Nandamuri Balakrishna

Updated on: May 02, 2026 | 1:51 PM

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే సుమారు వందకు పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కానీ విధంగా పౌరాణిక, జానపద సోషల్ డ్రామా జానర్స్ టచ్ చేసిన ఘనత బాలయ్యదే. అందుకు తగ్గట్టుగానే బాలయ్య సినిమా కెరీర్ లో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అలాగే బ్లాక్ బస్టర్స్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే వీటితో పాటు కొన్ని దారుణమైన డిజాస్టర్ సినిమాలు కూడా బాలయ్య ఖాతాలో ఉన్నాయి. అలా కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ నటించిన ఫ్లాప్ సినిమాల గురించి చర్చ జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ బాలయ్యని ఆసక్తికర ప్రశ్న అడిగారు. మీ కెరీర్ లో ఈ సినిమా ఎందుకు చేశానా అని అనిపించినవి ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దానికి బాలయ్య ఇలా బదులిచ్చారు.. ‘ నేను ఇప్పటివరకు 100కి పైగా సినిమాలు చేశాను. అందులో కొన్ని రాడ్డు రంబోలా లాంటి సినిమాలు తప్పకుండా ఉంటాయి. అలాంటి రాడ్డు సినిమాల్లో ముందుగా చెప్పాలి అంటే కత్తుల కొండయ్య అనే మూవీ ఉంది. అది పెద్ద రాడ్డు లాంటి సినిమా’ అని బాలయ్య అంగీకరించారు. 1985లో విడుదలైన ఈ సినిమాకు ఎస్బీ చక్రవర్తి దర్శకత్వం వహించారు.

ఇదే కార్యక్రమంలో తనకు ఇష్టమైన సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు బాలయ్య. ‘నాకు ఎంతో ఇష్టమైన మూవీ యువరత్నరాణా. ఎంతో ఇష్టపడి ఆ సినిమా చేశా. పెర్ఫార్మెన్స్ లో నేనంటే ఏంటో ఆ సినిమాలో చూపించా. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా నిరాశ పరిచింది. కొన్ని మనకి నచ్చి చేసినప్పటికీ వర్కౌట్ కావు’ అని బాలయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా బాలయ్య అభిమానులను బాగా నిరాశపర్చిన సినిమాల్లో పల్నాటి బ్రహ్మనాయుడు, ఒక్క మగాడు కూడా ఉన్నాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయాం పాలయ్యాయి. ఇక ఇటీవలే అఖండ 2 తాండవం సినిమాతో అభిమానులన పలకరించిన బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉంటున్నారు. ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. దీంతో పాటు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యారు బాలయ్య. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us