Nandamuri TarakaRatna: ఆ పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా: నందమూరి బాలకృష్ణ
Taraka Ratna Passes Away: తారకరత్న బాబాయ్ నందమూరి బాలకృష్ణ 23 రోజులుగా హాస్పిటల్ వద్దే ఉన్నారు. తారకరత్న ప్రాణాలతో బయటకు రావాలని నిరంతరం తపించారు.

Nandamuri Taraka Ratna Death: నందమూరి తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) (40) తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తారకరత్న బాబాయ్ నందమూరి బాలకృష్ణ 23 రోజులుగా హాస్పిటల్ వద్దే ఉన్నారు. తారకరత్న ప్రాణాలతో బయటకు రావాలని నిరంతరం తపించారు. మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడనుంటే కానరాని లోకాలకు వెళ్ళాడంటూ బాలయ్య ఓ ప్రకటన విడుదల చేశారు.
‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి’ అంటూ నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.
టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
చివరకు విదేశీ డాక్టర్లతో చికిత్సను అందించినా.. అయినా ఆయన ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు. 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఈ రోజు (శనివారం 18న )తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.







