
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సక్సెస్ డెరెక్టర్స్ మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోనూ నటిస్తున్నట్లు టాక్ వినిపించినప్పటికీ అది నిజం కాలేదు. అయితే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ అంతగా కనిపించడు మోక్షజ్ఞ. ఆయనకు సంబంధించిన ఫోటోస్ అరుదుగా బయటకు వస్తుంటాయి. తాజాగా మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఇంట్లో బర్త్ డే సెలబ్రెషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా తనయుడితో కేక్ కట్ చేయించి.. అనంతరం కుమారుడికి కేక్ తినిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత మోక్షజ్ఞ ఫోటోస్ చూసిన నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక త్వరలోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ దర్శకత్వంలో బాలయ్య ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నారు. ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Natasimha #NandamuriBalakrishna celebrates his son#NandamuriMokshagna‘s birthday#HBDNandamuriMokshagna pic.twitter.com/TyY2BOeX2H
— Vamsi Kaka (@vamsikaka) September 6, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.