శోభిత మెడలో మూడుముళ్ళు వేసిన నాగ చైతన్య.. అన్న పెళ్ళిలో అఖిల్ అల్లరి.. వీడియో

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగ చైతన్య, శోభితా ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. గత కొద్ది రోజులుగా పెళ్లికి ముందు జరిగిన ఫంక్షన్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శోభిత మెడలో మూడుముళ్ళు వేసిన నాగ చైతన్య.. అన్న పెళ్ళిలో అఖిల్ అల్లరి.. వీడియో
Naga Chaitanya, Shobitha
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 05, 2024 | 10:43 AM

అక్కినేని ఇంట పెళ్లిసందడి దృశ్యాలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాగచైతన్య- శోభిత దూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు… సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానా, అల్లు అరవింద్‌ సహా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఇప్పటికే పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నాగార్జున. అక్కినేని కుటుంబంలోకి శోభితకు వెల్‌కమ్‌ చెప్పారు. అక్కినేని కుటుంబానికి ఈరోజు మరిచిపోలేని రోజన్నారు. శోభిత, నాగచైతన్య కలిసి అందమైన జీవితాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషానిస్తోందన్నారు. కుటుంబంతో పాటు స్నేహితుల ప్రేమతో హృదయం ఉప్పొంగుతోందంటూ సోషల్‌ మీడియా ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు నాగార్జున.