Nandamuri Balakrishna: ఆ వార్తల్లో నిజం లేదు… బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు..
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు. టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు అఖండ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తాగ్గకుండా సినిమాను తెరకెక్కుతున్నాడు బోయపాటి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అఖండ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే బాలయ్య ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. అయితే ఈ సినిమాకు రౌడీయిజం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని పై మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. NBK107 టైటిల్‌ను సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. టైటిల్‌ను ఫిక్స్ చేసారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవి నిజం కాదు. దయచేసి అభిమానులు ఊహాగానాలు నమ్మొద్దు. టైటిల్‌ను ఇతర వివరాలను సరైన సమయంలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఓ వాస్తవఘటన ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. గతంలో గోపీచంద్ ఇలాంటి కథతోనే ‘క్రాక్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన బాలయ్యను సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :