NTR 30 : దద్దరిల్లినే న్యూజెర్సీ.. NTR థీమ్ సాంగ్‌తో రచ్చలేపిన అనిరుద్
ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు కథను అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు తారక్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను కూడా దించేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు కథను అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు తారక్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను కూడా దించేశాడు. ఇక ఈ సినిమానుంచి రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ లో తారక్ జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా వచ్చేస్తున్నా అని తారక్ చెప్పిన చిన్న డైలాగే న్యూజెర్సీలోని ఓ ఇండోర్ స్టేడియాన్ని ఊపేసింది. తారక్ హార్ట్ కోర్ ఫ్యాన్స్అరుపులతో.. స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ ఎన్టీఆర్ 30 సినిమాలో థీమ్ సాంగ్ ఇప్పుడు యూస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ థీమ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన అనిరుధ్.. తన అమెరికా మ్యూజికల్ టూర్ లో భాగంగా.. తాజాగా న్యూ జెర్సీలో ఏర్పాటు చేసిన ఓ షోలో.. ప్లే చేశారు.
అప్పటికే కన్స్‌ర్ట్‌లో ప్లే అవుతున్న సాంగ్స్ వింటూ కూర్చున్న ఆడియెన్స్… ‘వస్తున్నా..’ అని ఎన్టీఆర్ డైలాగ్‌తో ప్లే అయిన ఎన్టీఆర్ 30 థీమ్ మ్యూజిక్‌తో.. ఒక్కసారిగా ఊగిపోయారు. అరుస్తూ.. గోలచేస్తూ… స్టేడియాన్ని ఊపేశారు. అంతేకాదు ఇక ఈ వీడియోలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.




