Mufasa Telugu Trailer: ‘ముఫాసా’ తెలుగు ట్రైలర్ చూశారా..? మహేష్ డైలాగ్స్‏కు ఫిదా కావాల్సిందే..

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా పై మంచి బజ్ నెలకొంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదివరకే ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీలో కీలకమైన ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు.

Mufasa Telugu Trailer: 'ముఫాసా' తెలుగు ట్రైలర్ చూశారా..? మహేష్ డైలాగ్స్‏కు ఫిదా కావాల్సిందే..
Mufasa, Mahesh Babu
Follow us

|

Updated on: Aug 26, 2024 | 12:39 PM

వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ముఫాసా: ది లయన్ కింగ్. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇప్పటికే ది లయన్ కింగ్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా పై మంచి బజ్ నెలకొంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదివరకే ఈ మూవీ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీలో కీలకమైన ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు. ఈ విషయాన్ని గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో మహేష్ డైలాగ్స్ ఫిదా చేస్తున్నాయి.

“అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అంతలోనే అవి మాయమవుతున్నాయి” అంటూ మహేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన విజువల్స్, మహేష్ చెప్పే డైలాగులతో ఈ మూవీ ట్రైలర్ ఆద్యంత అలరించేలా సాగింది. ముఫాసాకు వాయిస్ అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు మహేష్. “మనకు తెలిసిన.. ఇష్టపడే పాత్రకు ఇది కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్లాసిక్ కు నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది” అని తెలిపారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ముఫాసా పాత్రకు హిందీలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వాయిస్ అందించారు. అలాగే ముఫాసా చిన్నప్పటి పాత్రకు షారుఖ్ చిన్న కుమారుడు అబ్రం.. సింబా పాత్రకు షారుఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఫాసా తెలుగు ట్రైలర్ అదిరింది. మహేష్ డైలాగ్స్ విన్నారా..?
ముఫాసా తెలుగు ట్రైలర్ అదిరింది. మహేష్ డైలాగ్స్ విన్నారా..?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు..ఐదుగురు
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు..ఐదుగురు
రూ. 18 వేల ఫోన్‌ రూ. 12 వేలకే.. కళ్లు చెదిరే ఫీచర్స్‌
రూ. 18 వేల ఫోన్‌ రూ. 12 వేలకే.. కళ్లు చెదిరే ఫీచర్స్‌
'కన్నప్ప' సినిమాలో మంచు విష్ణు వారసుడు..
'కన్నప్ప' సినిమాలో మంచు విష్ణు వారసుడు..
మళ్లీ భయపెట్టేందుకు వస్తోన్న తుంబాడ్.. రీ-రిలీజ్ ఎప్పుడంటే?
మళ్లీ భయపెట్టేందుకు వస్తోన్న తుంబాడ్.. రీ-రిలీజ్ ఎప్పుడంటే?
ఓరీ దేవుడో.. రన్నింగ్‌లో ఉన్న రైలు రెండుగా విడిపోయింది.. ఆ తర్వాత
ఓరీ దేవుడో.. రన్నింగ్‌లో ఉన్న రైలు రెండుగా విడిపోయింది.. ఆ తర్వాత
కళ్యాణ్, అప్పూలను బయటకు వెళ్లమన్న ప్రకాశం.. ఇచ్చి పడేసిన పెద్దాయన
కళ్యాణ్, అప్పూలను బయటకు వెళ్లమన్న ప్రకాశం.. ఇచ్చి పడేసిన పెద్దాయన
విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ..
విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!

హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!
బ్రెయిన్‌ సర్జరీలో వైద్యుల తప్పిదం.. పాపం ఆ రోగి.!
ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!
ఇంకొక్క రోజు సెలవు పెట్టినా.. ఆ యువతి బతికేది.!