AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa: సినిమాల్లో మంచు విష్ణు వారసుడు.. ‘కన్నప్ప’ సినిమాలో అవ్రమ్ లుక్ రివీల్..

ఇందులో అవ్రమ్ తిన్నడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తిన్నడు పెద్దయ్యాక భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. అంటే కన్నప్ప సినిమాలో మంచు విష్ణు చిన్నప్పటి పాత్రలో అవ్రమ్ కనిపించనున్నాడు. ఈ పోస్టర్ ను మోహన్ బాబు షేర్ చేస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అవ్రమ్ కు ఇది ఫస్ట్ మూవీ కావడంతో నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.

Kannappa: సినిమాల్లో మంచు విష్ణు వారసుడు.. 'కన్నప్ప' సినిమాలో అవ్రమ్ లుక్ రివీల్..
Avraam
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2024 | 12:24 PM

Share

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ కొన్ని నెలలుగా శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ తారాగణాన్ని రంగంలోకి తీసుకువచ్చాడు విష్ణు. సౌత్, నార్త్ టాప్ నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైతం ఈ మూవీలో స్పెషల్ రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కన్నప్ప సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. ఈరోజు (ఆగస్ట్ 26)న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ మూవీ నుంచి మంచు విష్ణు తనయుడు అవ్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో అవ్రమ్ తిన్నడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తిన్నడు పెద్దయ్యాక భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. అంటే కన్నప్ప సినిమాలో మంచు విష్ణు చిన్నప్పటి పాత్రలో అవ్రమ్ కనిపించనున్నాడు. ఈ పోస్టర్ ను మోహన్ బాబు షేర్ చేస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అవ్రమ్ కు ఇది ఫస్ట్ మూవీ కావడంతో నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.

తనయుడు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాలో అవ్రమ్ లుక్ లాంచ్ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ ప్రపంచానికి తాను నటుడిగా పరిచయం అవుతున్నందుకు మాటలు రావడం లేదు అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రానికి మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు ఈ చిత్రాన్ని దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో ప్రీతి ముకుందన్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ లో విష్ణు పరిచయం.. యుద్ధ ఘట్టాల్లో సాహసాలు, చివరగా అతిథి పాత్రలలో ప్రభాస్, అక్షయ్ కుమార్ కనిపించడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.