Sita Ramam: రష్మిక గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్..
హిందీలో కుంకుమ భాగ్య. అది అన్ని భాషల్లో డబ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగులో వైజయంతి మూవీస్ బేనర్ లో హీరోయిన్ గా చేస్తానని అనుకోలేదు.

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా సీతారామం (Sita Ramam). వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మృణాల్ మాట్లాడుతూ.. ” హిందీలో కుంకుమ భాగ్య. అది అన్ని భాషల్లో డబ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగులో వైజయంతి మూవీస్ బేనర్ లో హీరోయిన్ గా చేస్తానని అనుకోలేదు. అందులోనూ దుల్కర్ సల్మాన్ హీరోగా, అశ్వనీదత్ నిర్మాతగా చేస్తున్న సినిమా నాకు ఇదో గొప్ప అచీవ్ మెంట్. హిందీ జర్సీ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా నేను చంఢీగర్ లో వున్నాను. హనుగారు ఫోన్ చేసి ఒకసారి కలవాలన్నారు. అలా ముంబైలో కాఫీషాప్ లో కలిశాం. ఆ తర్వాత పూర్తి కథను ఆఫీసులో విన్నా. ఆయన నెరేషన్ చేసే విధానం నా ఎగ్జైట్‌మెంట్ చూసి వెంటనే ఫిక్స్ చేశారు. ” అంటూ చెప్పుకొచ్చారు.




అలాగే హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడుతూ.. ఆమెలో ఎనర్జీ లెవల్ ఎక్కువ. తను ఒకరోజు ముంబై, మరో రోజు చెన్నై, ఫారిన్ ఇలా చలాకీగా తిరుగుతుంది. సెట్లో చాలా హుషారుగా వుంటుంది. అందరినీ చాలా కేర్ తీసుకుంటుంది. తను కేర్ ఫుల్ గా వుంటుంది. మా కాంబినేషన్ సీన్స్ సినిమాలో చూడాల్సిందే. సీతారామం వంటి కథలు రేర్ గా వస్తాయి. ఇప్పటి జనరేషన్‌కు అప్పటి అనుబంధాలు, ఆప్యాయతలు, అన్ని ఎమోషన్స్ కనిపిస్తాయి. ఇందులో కామెడీ కూడా వుంది. సుమంత్, తరుణ్ భాస్కర్ వంటి నటుల నటన, రష్మిక నటనతోపాటు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు హైలైట్ గా వుంటుంది. యుద్ధం, మిస్టరీ అన్నీ అంశాలు ఇందులో వున్నాయి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అని తెలిపింది.




