Custody: ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కస్టడీ వీడియో..

|

May 06, 2023 | 1:27 PM

ఇప్పటివరకు లవర్ బాయ్స్ లా ప్రేమకథా చిత్రాలతో అలరించిన అక్కినేని హీరోస్.. ఇప్పుడు పంథా మార్చారు. ఇటీవలే ఏజెంట్ సినిమాతో సీరియస్ లుక్ లోకి అఖిల్ మారాగా.. ఇప్పుడు చైతూ వెరీ సీరియస్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు.. తమిళ్ ప్రేక్షకులను కూడా తన కస్టడీకి తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టారు.

Custody: ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న కస్టడీ వీడియో..
Custody
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీరికి అమ్మాయిలు… ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. నాగార్జున నుంచి నాగచైతన్య, అఖిల్ వరకు గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇప్పటివరకు లవర్ బాయ్స్ లా ప్రేమకథా చిత్రాలతో అలరించిన అక్కినేని హీరోస్.. ఇప్పుడు పంథా మార్చారు. ఇటీవలే ఏజెంట్ సినిమాతో సీరియస్ లుక్ లోకి అఖిల్ మారాగా.. ఇప్పుడు చైతూ వెరీ సీరియస్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు.. తమిళ్ ప్రేక్షకులను కూడా తన కస్టడీకి తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టారు.

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న కస్టడీ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆక్టటుకున్నాయి. ఈ సినిమాను మే 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కస్టడీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో తన పర్ఫార్మెన్స్‌తో.. లుక్స్తో.. అందరి స్టన్‌ అయ్యేలా చేస్తూ..దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్నారు. ముఖ్యంగా ఇందులో చై సిన్సియర్ కానిస్టేబుల్‌గా కనిపించిన తీరు.. చేసిన యాక్షన్… స్టంట్స్‌ ఈ సినిమాపై విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నాయి. దాంతో పాటే ఈ సినిమాలో విలన్‌గా అరవింద స్వామి చేస్తుండడం.. ట్రైలర్‌లో చాలా నటోరియస్ కిల్లర్ గా కనిపించడం కూడా సినిమాలో ఏదో విషయం ఉందనే హింట్ అందరికీ కన్వే అవుతుంది.

ఇక ట్రైలర్ చివర్లో న్యాయం పక్కన నిలబడి చూడు నీ లైఫే మారిపోతుందని.. నిజం గెలవడానికి లేటవుతుంది… కానీ ఖచ్చింతంగా గెలుస్తుందని చై చెప్పిన డైలాగ్స్‌.. యువన్ బీజీఎమ్‌ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కస్టడీ ట్రైలర్ తెగ వైరలవుతుంది.వాస్తవంగా చెప్పాలంటే..ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్.. ట్రైలర్ తో మూవీ పై భారీగానే అంచనాలు పెరిగాయంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.