గుడిలో హీరోయిన్‌కు చేదు అనుభవం.. ఫిజికల్‌గా తాకుతూ..
సినీ కెరీర్ లోనూ తాము లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాం అని కూడా కొందరు మీడియా ముందు మాట్లాడారు. తమతో కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తించారు అని కూడా తెలిపారు. అలాగే హీరోయిన్స్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కొందరు అసభ్యకరంగా తాకడం వంటి పిచ్చి చేష్టలు కూడా చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారు.

మహిళలపై లైంగిక వేదింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. సామాన్య ప్రజలనుంచి సెలబ్రెటీల వరకు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని తెలిపి షాక్ ఇచ్చారు. సినీ కెరీర్ లోనూ తాము లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాం అని కూడా కొందరు మీడియా ముందు మాట్లాడారు. తమతో కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తించారు అని కూడా తెలిపారు. అలాగే హీరోయిన్స్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కొందరు అసభ్యకరంగా తాకడం వంటి పిచ్చి చేష్టలు కూడా చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారు. తాజాగా ఓ నటి తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలిపింది. ఓ గుడిలో తనకు చేదు అనుభవం ఎదురైందని తెలిపి షాక్ ఇచ్చింది.
మాలీవుడ్ డ్యాన్సర్, నటి కపిల వేణు తాజాగా తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని తెలిపింది. కపిల వేణు చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇటీవలే లారెన్స్ హీరోగా వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తాజాగా కపిల వేణు తనకు ఘోర అవమానం జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. తన స్నేహితురాలి డ్యాన్స్ పర్ఫామెన్స్ చూడటానికి స్థానికంగా ఉన్న ఒక గుడి ఉత్సవానికి హాజరయ్యానని చెప్పుకొచ్చింది.
అయితే ఆ గుడిలోపలికి వెళ్లే క్రమంలో తెలియక బయటకు వచ్చే దారి నుంచి వెళ్లిందట.. ఆతర్వాత అది సరైన దారి కాదు అని తెలుసుకొని క్యూ లైన్ లోకి వెళ్లే ప్రయత్నం చేసిందట. ఆ సమయంలో తనకు ఓ అవమానం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా అని రాసుకొచ్చింది. క్యూ లైన్ లోకి వెళ్లే సమయంలో అక్కడే ఉన్న ఓ వాలంటీర్ నన్ను తాకుతూ ఆపే ప్రయత్నం చేశాడు. అతను నన్ను తాకడంతో నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను.. ఏదైనా ఉంటే మాట్లాడాలి కానీ ఇలా తాకకూడదు అని నేను అతనితో వాదనకు దిగాను. అతను అంతటితో ఆగకుండా నాతో దురుసుగా ప్రవర్తించాడు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఇంతలో మరో ఆరుగురు వాలంటీర్లు అక్కడకు వచ్చి నన్ను టార్గెట్ చేశారు. అక్కడ సీన్ చెయ్యొద్దు అని నన్ను పంపించేశారు. నేను ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. కానీ వారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.