వారసుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దళపతి నటించిన సినిమా లియో. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అపజయమెరుగని డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించడం, చాలా రోజుల తర్వాత విజయ్- త్రిష కలిసి నటించడం, అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించడం.. ఇలా లియో సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ ఉంది. ఇందుకు తగ్గట్టే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ ఫ్యాన్స ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న లియో సినిమా విజయదశమి కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు ఫ్యాన్స్. కాగా ఇంతలా హైప్ క్రియేట్ చేసిన ‘లియో’ సినిమాకు కేరళలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. విడుదలకు ముందే కేరళ జనాలు ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ అభిమానులు ‘ లియో ‘ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు . దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో #KeralaBoycottLEO హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. లియో సినిమాపై ఈ దుమారం మొదలవ్వడానికి అభిమానులే కారణం. ఓ చిన్న విషయమై దళపతి విజయ్ అభిమానులు, మోహన్ లాల్ అభిమానులు సోషల్ మీడియాలో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. 2014లో విడుదలైన ‘జిల్లా’ సినిమాలో దళపతి విజయ్, మోహన్‌లాల్ ఇద్దరూ కలిసి నటించారు. అయితే ఈ మూవీలో మోహన్‌లాల్ నటనను కొందరు విజయ్ అభిమానులు ట్రోల్ చేశారు. అందుకే విజయ్ నటించిన ‘లియో’ చిత్రాన్ని కేరళలో విడుదల చేయనివ్వబోమని మోహన్ లాల్ అభిమానులు చెబుతున్నారు.
దళపతి విజయ్‌కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘లియో’ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ తమిళ చిత్రాన్ని కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ సినిమాకు బాయ్‌కాట్ హీట్ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. ‘లియో’ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ, ‘విక్రమ్’ సినిమాల కథకు, ‘లియో’ సినిమా కథకు లింక్ ఉందని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ చిత్ర బృందం సంజయ్ దత్ పోస్టర్‌ని విడుదల చేసి వైరల్‌గా మారింది. ‘జవాన్’, ‘జైలర్’ చిత్రాల విజయాల ఊపులో దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్ ‘లియో’కి కూడా స్వరాలు సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.