Manchu Manoj: మోహన్ బాబు పుట్టిన రోజు.. నాన్నకు ప్రేమతో అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్

గత కొద్ది నెలలుగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుతుగున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వైపు, ఇంకో వైపు మంచు మనోజ్ తరచూ ఏదో ఒక విషయంలో తగవులాడుకుంటూనే ఉన్నారు. ఆఖరికి ఇది పోలీసు కేసుల దాకా వెళ్లింది.

Manchu Manoj: మోహన్ బాబు పుట్టిన రోజు.. నాన్నకు ప్రేమతో అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
Manchu Manoj, Mohan Babu

Updated on: Mar 19, 2025 | 7:48 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు నేడు (మార్చి 19). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ సీనియర్ నటుడికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో తనయుడు మంచు మనోజ్ ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేస్తూ తన తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా మోహన్‌ బాబు ఫొటోను షేర్ చేసిన మనోజ్.. తన తండ్రితో కలిసి వివిధ సినిమాల్లో నటించిన మరుపు రాని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు. దీనికి యానిమల్ సినిమాలోని ‘నా సూర్యుడివి.. చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే’ అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ జోడించి తండ్రి పై తన ప్రేమను చాటుకున్నారు. అనంతరం .. ‘హ్యాపీ బర్త్ డే నాన్న.. ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మిస్సవుతున్నాను. నీ వెంట కలిసి నడిచేందుకు ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నా. నీతో ఉన్న ప్రతి క్షణాలను ప్రేమిస్తా నాన్న’ అంటూ తన తండ్రిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మనోజ్. ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన పోస్ట్, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్‌ చూసిన మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి లైక్‌ కొట్టింది. ఇక దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మోహన్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూనే, త్వరలో అందరూ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెట్టారు.

క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు సినీ పరిశ్రమతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచాయి. హైదరాబాద్ శివార్లలోని మోహన్ బాబు నివాసం వద్ద మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. చివరికి తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ గొడవల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..

ఈ క్రమంలోనే మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ వీడియో ను షేర్ చేస్తూ తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు మనోజ్. మరి అందరూ కోరుకుంటున్నట్లు వీరందరూ త్వరలోనే కలిసి పోవాలని మనమూ కోరుకుందాం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.