జక్కన్న సినిమాలో వేషం..ఇదో కొత్త తరహా మోసం

సినిమా అంటే పిచ్చి చాలామందికి ఉంటుంది. కొంతమంది బయటపడతారు. మరికొందరు మనసులోనే దాచుకుంటారు. సినిమాల్లో నటీనటులుగా రాణించాలనుకునే అమాయుకులే టార్గెట్‌గా కొంతమంది మోసగాళ్లు వసూళ్ల దందాలకు దిగుతున్నారు. అందుకు వారు ఎంచుకుంది కూడా సౌత్ ఇండియన్ ఏస్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళిని. ఆయన తాజాగా తీస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా కోసం నటులు కావాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ట్వీట్లు చేసింది. తమకు నటుల అవసరం […]

జక్కన్న సినిమాలో వేషం..ఇదో కొత్త తరహా మోసం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 01, 2019 | 4:49 PM

సినిమా అంటే పిచ్చి చాలామందికి ఉంటుంది. కొంతమంది బయటపడతారు. మరికొందరు మనసులోనే దాచుకుంటారు. సినిమాల్లో నటీనటులుగా రాణించాలనుకునే అమాయుకులే టార్గెట్‌గా కొంతమంది మోసగాళ్లు వసూళ్ల దందాలకు దిగుతున్నారు. అందుకు వారు ఎంచుకుంది కూడా సౌత్ ఇండియన్ ఏస్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళిని. ఆయన తాజాగా తీస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా కోసం నటులు కావాలంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ట్వీట్లు చేసింది. తమకు నటుల అవసరం ఉంటే నిర్మాణ సంస్థ అఫీషియల్  సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుపుతామని వెల్లడించింది.

‘కొంతమంది అపరిచితులు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేరుతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌మీడియా ఖాతాలు నడుపుతూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ‘ఆర్.ఆర్‌.ఆర్‌’ సినిమాకు క్యాస్టింగ్‌ కాల్స్‌ అంటూ ఫేక్‌ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత క్యాస్టింగ్ కాల్స్ గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మేం హెచ్చరిస్తున్నాం. మా ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా నేరుగా మా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అధికారిక మాధ్యమం ద్వారానే ప్రకటిస్తాం’ అని పోస్ట్‌లు చేశారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్ నటులు ఎన్టీ రామారావు, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ప్రతి సినిమాకు కథలో మొయిన్ థీమ్ పాయింట్‌ను ముందుగానే చెప్పే జక్కన్న..ఈ సారి కూడా కథను రివీల్ చేశాడు.  చెర్రీ.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌.. కొమరం భీమ్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ చెర్రీ భార్య పాత్ర పోషిస్తున్నారు. హీరో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిసింది. 2020 జులై 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.